Skip to main content

Telangana Gurukul Girls School : ఫుడ్‌ పాయిజన్‌తో గురుకుల విద్యార్థినులకు అస్వస్థత

Telangana Gurukul Girls School : ఫుడ్‌ పాయిజన్‌తో గురుకుల విద్యార్థినులకు అస్వస్థత
Telangana Gurukul Girls School : ఫుడ్‌ పాయిజన్‌తో గురుకుల విద్యార్థినులకు అస్వస్థత

ఘట్‌కేసర్‌: ఫుడ్‌ పాయిజన్‌తో మైనారిటీ గురుకులానికి చెందిన విద్యార్థినులు అస్వస్థతకు లోనయ్యారు. మేడ్చల్‌–మల్కాజ్‌గిరి జిల్లా నాగారంలోని మైనారిటీ గురుకులంలో 450 మంది విద్యార్థినులు ఉన్నారు. గురువారం ఉదయం అల్పాహారం బోండా, మధ్యాహ్నం చికెన్‌తో భోజనం చేశారు. తిరిగి సాయంత్రం అల్పాహారంలో బొప్పాయి తిన్నట్టు విద్యార్థినులు తెలిపారు. 

కొద్ది సేపటి తర్వాత కొంతమంది విద్యార్థినులకు కడుపు నొప్పి, వికారంగా అనిపించడంతో ప్రిన్సిపాల్‌ స్వప్నకు తెలి పారు. ఆమె ఘట్‌కేసర్‌లోని ప్రభుత్వ ఆస్పత్రికి విద్యార్థినులను వెంటనే తీసుకెళ్లారు. 33 మంది విద్యార్థినులను పరీక్షించి 9 మందిని అడ్మిట్‌ చేసుకున్నారు. విషయం తెలుసుకున్న మీడియా ప్రతినిధులు ఆస్పత్రికి వెళ్లగా వార్డెన్, ఇతర సిబ్బందితో కలిసి దుర్భాషలాడింది. 

ఇదీ చదవండి:  IAS inspiring Success Stories:ఆమె అస్సాం సివిల్‌ సర్వీస్‌ నెగ్గింది.. అమ్మ గెలిచింది

ఆస్పత్రికి మీరెందుకు వచ్చారంటూ ఫొటోలు తీ యకుండా అడ్డుకున్నారు. ప్రిన్సిపాల్‌ స్వప్న ను వివరణ కోరగా కడుపునొప్పి ఉందంటే విద్యార్థినులను ముందస్తుగా ఆస్పత్రికి తీసు కొచ్చామన్నారు. డాక్టర్‌ యాదయ్యను వివ రణ కోరగా 33 మందిని పరీక్షించామని అందులో 9 మందిని ఆస్పత్రిలో అడ్మిట్‌ చేసుకున్నామన్నారు. ఫుడ్‌ పాయిజన్‌తోనే ఇలా అయ్యిందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు.

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

Published date : 20 Dec 2024 03:41PM

Photo Stories