One Nation One Subscription: జయహో అనుసంధాన్ - వన్ నేషన్ వన్ సబ్ స్క్రిప్షన్ పథకం
- అమృత్ కాల్’లో దేశంలో పరిశోధన – అభివృద్ధి ప్రాధాన్యాన్ని ప్రస్తావించిన ప్రధాని: ‘జై అనుసంధాన్’ నినాదాన్నిచ్చిన ప్రధాని
- దేశంలో అత్యుత్తమ విద్య, అభివృద్ధికి పరిశోధనను ప్రధాన అంశంగా గుర్తించిన ఎన్ఈపీ 2020
- కేంద్ర ప్రభుత్వం స్థాపించిన అనుసంధాన్ జాతీయ పరిశోధన సంస్థ ఈ దిశగా ఓ ముందడుగు
భారత్ ను ఆత్మనిర్భరగా, 2047 నాటికి వికసిత భారత్ గా మలిచే దార్శనికతకు అనుగుణంగా వన్ నేషన్ వన్ సబ్ స్క్రిప్షన్ పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం – దేశవ్యాప్తంగా.. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల నిర్వహణలోని ఉన్నత విద్యా సంస్థలు, కేంద్ర ప్రభుత్వ పరిశోధన-అభివృద్ధి సంస్థల విద్యార్థులు, అధ్యాపకులు, పరిశోధకులకు అందుబాటులోకి రానున్న నిపుణుల అంతర్జాతీయ స్థాయి పరిశోధన వ్యాసాలు ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలు సహా అన్ని ప్రాంతాల్లోని దాదాపు 1.8 కోట్ల మంది విద్యార్థులు, అధ్యాపకులు, పరిశోధకులు, శాస్త్రవేత్తలకు నిపుణుల నాణ్యమైన ప్రచురణలను అందుబాటులోకి తెచ్చే విజ్ఞాన బాండాగారం.. తద్వారా దేశంలో ప్రధాన, బహుశాస్త్రాంతర పరిశోధనలకు ప్రోత్సాహం. భారత ప్రభుత్వం వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్ (ఓ ఎన్ ఓ ఎస్/ ONOS) పథకాన్ని ఇటీవలనే కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. గత ఐదు సంవత్సరాలుగా భారత ఉన్నత విద్యలో, పరిశోధనలో వినపడుతున్న ఈ పథకాన్ని ఒకసారి సమగ్రంగా తెలుసుకుందాం.
ఈ పథకం దేశవ్యాప్తంగా శాస్త్రీయ పరిశోధన వ్యాసాలు, ఎలక్ట్రానిక్ జర్నల్ ఆర్టికల్స్, ప్రచురణలకు యాక్సెస్ అందించడానికి అనుమతిస్తుంది. దీనివల్ల ఉన్నత విద్యావేత్తలు, పరిశోధకులు, విద్యార్థులు, అధ్యాపకులు, శాస్త్రవేత్తలు పూర్తి డిజిటల్ ప్రక్రియ ద్వారా సమాచారాన్ని పొందే అవకాశాన్ని కల్పిస్తారు. కేంద్ర ప్రభుత్వ ఉన్నత విద్యా సంస్థలు, పరిశోధన, అభివృద్ధి లేబొరేటరీల కోసం ఈ పథకం ద్వారా నాణ్యమైన సమాచారాన్ని అందించడం, నూతన పరిశోధనలకు, ఆవిష్కరణలకు గొప్ప అవకాశం కల్పించడమే ప్రధాన లక్ష్యం. ఇప్పటివరకు కొన్ని దేశాలు వేర్వేరు ప్రాంతాలు లేదా సంస్థల కోసం అంతర్జాతీయ జర్నల్స్ ను అందించేందుకు కన్సార్షియంలు ఏర్పాటు చేశాయి.
ఉదాహరణకు, బ్రిటన్ లో 'జేవిఎస్సీ', జర్మనీలో 'డీల్' వంటి సంస్థలు ఉన్నాయి. వన్ నేషన్ వన్ సబ్ స్క్రిప్షన్ పథకం దేశంలోని ప్రభుత్వ, అన్ని రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలోని ఉన్నత విద్యా సంస్థలు, పరిశోధన, అభివృద్ధి సంస్థలకు. అంతర్జాతీయ శాస్త్రీయ జర్నల్స్ కి యాక్సెస్ను అందిస్తుంది. 2025. 2026, 2027 ఈ సంవత్సరాలకు మొత్తం సుమారు రూ.6,000 కోట్లను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. వన్ నేషన్ పన్ సబ్స్క్రిప్షన్ పథకం భారత ప్రభుత్వమార్గదర్శకాలు, విద్యా రంగంలో జరుగుతున్న పలు నూతన విధానాలను ప్రేర ణగా తీసుకుని రూపొందించారు. ఈ పథకం పిఎస్ఆర్ఎఫ్ ప్రారంభం ద్వారా. మొత్తం 6794 సంస్థలు లబ్ధిపొందబోతున్నాయి, ఈ పథకం కింద 6794 సంస్థలు , విశ్వ విద్యాలయాలు-1245, UGC- ప్రభుత్వ కళాశాలలు-3128, మెడికల్ కళాశాలలు-355, ఇంజనీరింగ్ కళాశాలలు-2066, 13,000 జర్న ల్స్ ఉపయోగించుకునే అవకాశం కల్పిస్తుంది. 30 అంతర్జాతీయ ప్రచురణ సంస్థలకు కేంద్రం ద్వారా చెల్లింపులు చేస్తుంది.
ఆర్ అండ్ ది లేబొరేటరీలు, నాణ్య మైన పరిశోధనలు, ఆవిష్కరణల సంస్కృతిని ప్రోత్సహించడానికి ప్రేరణ ఇస్తాయి. ఈ పథకం ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలోని ఉన్నత విద్యాసంస్థలు, పరిశోధన సంస్థలు లబ్ధి పొందుతాయి. ప్రస్తుతం దేశంలో 15కు పైగా అకడమిక్ కన్సార్షియంలు ఉన్నాయి. ఈ పథకం పరిశోధనలు, ఆవిష్కరణలకు ప్రోత్సాహం, అంతర్జాతీయ పబ్లిషర్లు ఎల్సివియర్, సింగర్, నేచర్, వైలీ, టేలర్ & ఫ్రాన్సిస్, సేజ్, ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రెస్, బీఎంజే జర్నల్స్ వంటి ప్రముఖ ప్రచురణ సంస్థలు ఉన్నాయి. ఈ పథకంలో భాగంగా కవర్ చేయని ప్రచురణ సంస్థలకు సొంత బడ్జెట్లను ఉపయోగించి సన్రైజ్ చేయవచ్చు. ఈ పథకం భారతదేశంలోని అన్ని వర్గాల విద్యార్థులు, అధ్యాపకులు, పరిశోధకులు,
శాస్త్రవేత్తలకు శాస్త్రీయ జర్నల్స్క సమానంగా ప్రవేశాన్ని కల్పించి, రెండు, మూడు తరగతి నగరాలలో కూడా పరిశోధనలు, ఆవిష్కరణల కు ప్రోత్సాహకాన్ని పెంచుతుంది. ఉన్నత విద్య శాఖ వన్ నేషన్ వన్ సన్స్టీ స్క్రిప్షన్ అనే ఏకీకృత పోర్టల్ను ఏర్పాటు చేస్తుంది. ఈ పోర్టల్ ద్వారా ప్రామాణికమైన జర్నల్స్, జర్నల్ ఆర్టికల్స్, పరిశో ధన వ్యాసాలను ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. వన్ నేషన్ వన్ సబ్ స్క్రిప్షన్ పథకం విద్యా నాణ్యతపై ప్రభావం చూపుతుంది. పరిశోధన అభివృద్ధి: వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్ పథకం నూతన పరిశోధనలకు, ఆవిష్క రణలకు గట్టి పునాది వేసి, సైన్స్, టెక్నాలజీ, వైద్యం, పర్యావరణం, ఇతర రంగాల్లో నూతన విజ్ఞానం పెరిగేలా ప్రోత్సహిస్తుంది. ఈ పథకం పరిశోధనను అభివృద్ధి చేసే దిశలో కీలకమైన సమాచారాన్ని అందిపుచ్చుకునే అవకాశం: ఈ పథకం. రెండు తరగతి, మూడు తరగతి సగ రాల్లో ఉన్న విద్యార్థులు, ఆధ్యాపకులకు కూడా
అంతర్జాతీయ స్థాయిలో ఉన్నత విద్యా సమాచా రాన్ని సులభంగా అందించడానికి అవకాశాన్ని కల్పిస్తుంది. ఇది ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాల నుంచి విద్య పాండే విద్యార్థులకు అధిక నాణ్యత కలిగిన సమాచారాన్ని తమ సొంత ప్రాంతంలోనే బందించేఅవకాశం కల్పిస్తుంది. తద్వారా దిగువ తరగతుల మధ్య విద్యావ్యత్యాసం తగ్గుతుంది.
పరిశోధన సంస్కృతిని ప్రోత్సహించడం: వన్ నేషన్ వన్ సబ్ స్క్రిప్షన్ పథకం భారతదేశంలో పరిశోధన సంస్కృతిని ప్రోత్సహించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ పథకం వల్ల అనేక శాస్త్రీయ, పరిశోధనలను ప్రోత్సహించి, భారతదే శంలోమౌలిక, పలురంగాల పరిశోధనలకు పెద్ద వేదికను అందిస్తుంది. దీంతో కొత్త ఆవిష్కరణల కు, పరిశోధనా అవగాహనకు బలమైన పునాది ఏర్పడుతుంది. సాధనల సమీకరణ: ఈ పథకంలో భాగంగా అన్ని ప్రభుత్వ ఉన్నత విద్యాసంస్థలు ఒకే వేదిక ద్వారా సమాచారాన్ని పుచ్చుకోవచ్చు. గతంలో వేర్వేరు సంస్థలు, మంత్రిత్వ శాఖలు వేర్వేరు విద్యా నాణ్యతలో అభివృద్ధి.
ఓఎన్టిఎస్ పథకం భారతదేశంలో ఉన్నత విద్యారంగంలో మరింత నాణ్యతను, పురోగతిని, సమగ్రతను తీసుకురావడంలో కీలకమైన పాత్రను పోషిస్తుంది. ఈ పథకం ద్వారా, ప్రభుత్వ విద్యా సంస్థలు, పరిశోధనా సంస్థలు, శాస్త్రీయ సంఘాలు అందుబాటులో ఉన్న అత్యుత్తమమైన శాస్త్రీయ సమాచారంతో నూతన ఆవిష్కరణలు, పరిశోదనలు చేపడతారు. దీనివల్ల దేశం అన్ని రంగాల్లో పురోగతి సాధిస్తుంది. భారత ప్రభుత్వ 'ఆత్మ నిర్వరభారత్' 'వికపిత్ భారత@ 2047 లక్ష్యాలను సాధించడంలో ఈపథకం కీలక పాత్ర పోషిస్తుంది. కొత్త జాతీయ విద్యావిధానం 2020, ఎఎన్ఆర్ఎఫ్ లక్ష్యాలతో ఈ పథకం అనుసంధానంగా పనిచేస్తుంది. 2025 జనవరి 1న ఈ పథకం ప్రారంభం అవుతుంది. వన్ నేషన్ వన్ సబ్ స్క్రిప్షన్ పథకం భారతదేశంలోని విద్యానాణ్యతను: పెంచి, పరిశోధన అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుంది.
వన్ సబ్ స్క్రిప్షన్లు పొందినప్పుడు ఉన్న విభిన్న పరిస్థితుల కంటే, ఓఎన్ఎస్ పథకం సమన్వయాన్ని పెంచుతుంది. ఇది అన్ని సంస్థలకు ఒకే వేదికపై సమాచారాన్ని అందించేందుకు అనుకూలంగా ఉంటుంది. తద్వారా నిర్వహణను సులభం చేస్తుంది. అంతర్జాతీయ స్థాయిలో పోటీ వృద్ధి: వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం వన్ నేషన్ వన్ సబ్ స్క్రిప్షన్ పథకానికి ఆమోదం తెలిపింది. నిపుణుల పరిశోధన వ్యాసాలు, పత్రికల్లో ప్రచురణలను ఈ కేంద్ర ప్రభుత్వ పథకం (సెంట్రల్ సెక్టార్ స్కీమ్) దేశవ్యాప్తంగా అందుబాటులోకి తెస్తుంది. సరళమైన, వినియోగదారీ అనుకూల, పూర్తి సాంకేతిక ప్రక్రియ ద్వారా ఈ పథకాన్ని నిర్వహిస్తారు. ప్రభుత్వ ఉన్నత విద్యా సంస్థలు, కేంద్ర ప్రభుత్వ పరిశోధన-అభివృద్ధి సంస్థలకు ‘వన్ నేషన్ వన్ సబ్ స్క్రిప్షన్’ సదుపాయం ఉంటుంది.
కేంద్ర ప్రభుత్వ కొత్త పథకమైన వన్ నేషన్ వన్ సబ్ స్క్రిప్షన్ కోసం 2025, 2026, 2027 సంవత్సరాలకు మొత్తం రూ.6,000 కోట్లు కేటాయించారు. దశాబ్ద కాలంగా విద్యారంగంలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వివిధ కార్యక్రమాల పరిధిని పెంచి, మరింత మెరుగుపరచడంతోపాటు.. దేశ యువతకు ఉన్నత విద్యను ఈ పథకం గరిష్టంగా అందుబాటులోకి తెస్తుంది. ఇది ఏఎన్ఆర్ఎఫ్ అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ కార్యక్రమానికి అనుబంధంగా ఉంటూ పరిశోధన-అభివృద్ధిని ప్రోత్సహిస్తుంది. అంతేకాకుండా, ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, పరిశోధన సంస్థలు, పరిశోధన-అభివృద్ధి ప్రయోగశాలల్లో పరిశోధన-అభివృద్ధి సంస్కృతిని పెంపొందిస్తుంది.
వన్ నేషన్ వన్ సబ్ స్క్రిప్షన్ పథకం ప్రయోజనాలు కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వ నిర్వహణలోని అన్ని ఉన్నత విద్యా సంస్థలకు, కేంద్ర ప్రభుత్వ పరిశోధన-అభివృద్ధి సంస్థలకు అందుతాయి. సమాచార-గ్రంథాలయ వ్యవస్థ (ఐఎన్ఎఫ్ఎల్ఐబీఎన్ఈటీ) ఇన్ఫర్మేషన్ లైబ్రరీ నెట్వర్క్, అహ్మదాబాద్ గుజరాత్.
ఇది వికసిత భారత్@2047, జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ) 2020, అనుసంధాన్ జాతీయ పరిశోధన సంస్థ (ఏఎన్ఆర్ఎఫ్) లక్ష్యాలకు అనుగుణంగా ఉంది. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలు సహా దేశవ్యాప్తంగా అన్ని విభాగాల్లో పెద్దసంఖ్యలో ఉన్న విద్యార్థులు, అధ్యాపకులు, పరిశోధకులు, శాస్త్రవేత్తలకు పరిశోధన ప్రచురణలను మరింత విస్తృతంగా అందుబాటులోకి తెస్తుంది. తద్వారా దేశంలో ప్రధానమైన, బహుశాస్త్రాంతర పరిశోధనలను ప్రోత్సహిస్తుంది. వన్ నేషన్ వన్ సబ్ స్క్రిప్షన్ వినియోగం, ఆయా సంస్థల్లో భారతీయ రచయితల ప్రచురణలను ఏఎన్ఆర్ఎఫ్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తుంది.
‘వన్ నేషన్ వన్ సబ్ స్క్రిప్షన్’ ఏకీకృత పోర్టల్ ఉన్నత విద్యాశాఖ ఆధ్వర్యంలో ఉంటుంది. దాని ద్వారా ఆ సంస్థలకు ప్రచురణలు అందుబాటులో ఉంటాయి. తద్వారా దేశంలో ప్రధానమైన, బహుశాస్త్రాంతర పరిశోధనలను ప్రోత్సహిస్తుంది. వన్ నేషన్ వన్ సబ్ స్క్రిప్షన్ వినియోగం, ఆయా సంస్థల్లో భారతీయ రచయితల ప్రచురణలను ఏఎన్ఆర్ఎఫ్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తుంది. వన్ నేషన్ వన్ సబ్ స్క్రిప్షన్ లభ్యత, వినియోగంపై- ఉన్నత విద్యా శాఖ, ఇతర మంత్రిత్వ శాఖల ఆధ్వర్యంలోని ఉన్నత విద్యా సంస్థలు, వాటి నిర్వహణలో ఉన్న పరిశోధన-అభివృద్ధి సంస్థలు తమ విద్యార్థులు, అధ్యాపకులు, పరిశోధకులకు అవగాహన కల్పించాలి.
ఇందుకోసం సమాచారం, విద్య, సమాచార ప్రసరణ/కమ్యూనికేషన్ (ఐఈసీ) కార్యక్రమాలను క్రియాశీలకంగా నిర్వహించాలి. ఫలితంగా దేశవ్యాప్తంగా ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకునే అవకాశం మెరుగవుతుంది. అన్ని ప్రభుత్వ సంస్థల విద్యార్థులు, అధ్యాపకులు, పరిశోధకులు ఈ విశిష్ట సదుపాయాన్ని గరిష్టంగా ఉపయోగించుకునేలా రాష్ట్ర ప్రభుత్వాలు తమ స్థాయిలో ప్రచారం చేయాలని తెలియచేశారు.
Dr. ఆనందం దుర్గాప్రసాద్, సహాయ ఆచార్యులు గ్రంథాలయ సమాచార శాస్త్రం, ప్రభుత్వ డిగ్రీ కళాశాల హయత్ నగర్, హైదరాబాద్.
Tags
- One Nation One Subscription
- ONOS
- Indias One Nation One Subscription plan
- Cabinet approves One Nation One Subscription
- Govt reveals more info about One Nation One Subscription
- One Nation One Subscription 2024
- One Nation One Subscription scheme
- One Nation
- One Subscription UPSC
- One Nation One Subscription Ministry of Education
- One Nation One Subscription latest News
- One Nation One Subscription circular
- Latest News
- Anandam Durgaprasad