Adilabad District News: మైత్రి ట్రాన్స్‌జెండర్ క్లినిక్‌ను వర్చువల్ విధానంలో ప్రారంభించిన సీఎం రేవంత్‌రెడ్డి
ఆదిలాబాద్: తెలంగాణ ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా రిమ్స్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన పారామెడికల్ కోర్సును, మైత్రి ట్రాన్స్‌జెండర్ క్లినిక్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహులు సోమవారం హైదరా బాద్ నుంచి వర్చువల్ విధానంలో ప్రారంభించా రు. ఈసందర్భంగా పలు విషయాలపై సీఎం మా ట్లాడారు. కాగా రిమ్స్‌లో నిర్వహించిన కార్యక్రమానికి కలెక్టర్ రాజర్షిషా హాజరయ్యారు. ట్రాన్స్‌జెండ ర్ కోసం రిమ్స్‌లో ప్రత్యేకంగా మైత్రి క్లినిక్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అనంతరం రిమ్స్ సూపర్ స్పెషాలిటీలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. వైద్య సేవల వివరాలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, డీఎంహెచ్‌వో నరేందర్ రాథోడ్, జీసీసీ చైర్మన్ కోట్నాక్ తిరుపతి, మెడికల్ సూపరింటెండెంట్ అశోక్ తదితరులు పాల్గొన్నారు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
☛ Join our WhatsApp Channel (Click Here)
☛ Join our Telegram Channel (Click Here)
Tags
- Adilabad District News
- Adilabad District Latest News
- Latest News
- CM Revanth Reddy started Maitri Transgender Clinic
- cm revanth reddy
- Sakshi Education News
- Education News
- TelanganaPublicAdministration
- ChiefMinisterRevanthReddy
- HealthMinisterDamodarRajanarsimhulu
- PublicAdministrationVictory
- HealthcareInitiatives