Nagarkurnool District News: పారా మెడికల్ కోర్సులను ప్రవేశపెడితే మెరుగైన వైద్య సేవలు అందుతాలు : కలెక్టర్ బదావత్ సంతోష్
నాగర్‌కర్నూల్ : జిల్లాలో పారా మెడికల్ కోర్సులను ప్రవేశపెడితే విద్యార్థులకు మేలు జరగడంతోపాటు.. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతాయని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. ప్రజా పాలన విజయోత్సవాల్లో భాగంగా సోమవారం ఆరోగ్య దినోత్సవం కార్యక్రమాన్ని సీఎం రేవంత్‌రెడ్డి రేవంత్‌రెడ్డి హైదరాబాద్ నుంచి వర్చువల్ విధానం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా నర్సింగ్ కాలేజీలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉయ్యాలవాడ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఏర్పాటు చేసిన వీసీలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. స్థానిక జనరల్ ఆస్పత్రిలో ప్రత్యేకంగా ట్రాన్స్‌జెండర్లకు క్లినిక్ ఏర్పాటు చేశామన్నారు. అనంతరం కలెక్టర్ నూతన మెడికల్ కళాశాల భవనం, ఇతర వసతి గృహాలు, తరగతి గదుల భవనాలను కలెక్టర్ పరిశీలించారు. మెడికల్ కళాశాలలో చివరి దశలో ఉన్న పనులను వేగవంతం పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. రానున్న రోజుల్లో నూతన మెడికల్ కళాశాల భవనాన్ని ప్రారంభించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆయా మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ రమాదేవి, డీఎంహెచ్‌ఓ స్వరాజ్యలక్ష్మి, జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ రఘు, వైద్య, నర్సింగ్ విద్యార్థులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి: TSPSC Jobs Notifications 2024 : 21 నోటిఫికేషన్లు.. 12,403 ఉద్యోగాలకు