Skip to main content

Telangana Colleges Bandh : రాష్ట్ర‌వ్యాప్తంగా కాలేజీలు బంద్‌.. పిలువు.. ఎందుకంటే...?

సాక్షి ఎడ్యుకేష‌న్ : రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రైవేట్ డిగ్రీ, పీజీ కాలేజీల నిరవధికంగా బంద్ చేయనున్నారు. ఈ మేర‌కు వివిధ కాలేజీల యాజమాన్య అసోషియేషన్ నిర్ణయం తీసుకుంది. ప్రైవేట్ కాలేజీల్లో చదువుకునే పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఫీజు రియంబర్స్‌మెంట్ చెల్లించకపోవడంతో.. కళాశాలల యాజమాన్యాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని కాలేజీల‌ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి నరసింహాయాదవ్ అన్నారు.
Telangana Colleges Bandh  Sakshi Education: All private degree and PG colleges across the state will be closed indefinitely. The management association of various colleges has taken a decision to this extent. General Secretary of Colleges Association Narasimhayadav said that due to non-payment of fee reimbursement to poor and middle class students studying in private colleges, college owners are facing serious difficulties

వివిధ కాలేజీల‌ నిర్వాహకుల పరిస్థితి దయనీయంగా తయారైంది. కనీసం భవనాల అద్దెలు చెల్లించడానికి డబ్బులు లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బకాయిలు ఉన్న ఫీజు రియంబర్స్‌మెంట్‌ను విడుదల చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫీజు రియంబర్స్‌మెంట్ నిధులను విడుదల చేయని కారణంగా..  ఓయూ రిజిస్ట్రార్ ఫ్రొఫెసర్ లక్ష్మీనారాయణకు అసోసియేషన్ ప్రతినిధులు వినతిపత్రం అందజేశారు. అలాగే ఈ ఫీజులు చెల్లించే వ‌ర‌కు కాలేజీల‌ను నిరవధికంగా బంద్ చేస్తామ‌న్నారు.  

రూ.3 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్..
రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం కోసం ప్రతి సంవత్సరం రూ.2,500 కోట్లు కేటాయిస్తోంది, అందులో 40 శాతం అంటే రూ.1,000 కోట్లు నాన్ ప్రొఫెషనల్ ప్రోగ్రామ్‌ల విద్యార్థులకు కేటాయిస్తోంది. గత మూడు విద్యా సంవత్సరాల్లో మొత్తం రూ.3 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని.. ప్రైవేట్ కాలేజీల నిర్వాహకులు చెబుతున్నారు. రూ.800 కోట్లకు టోకెన్లు జారీ చేసినట్లు కళాశాలల యాజమాన్యాలు చెబుతున్నాయి. అయితే ఆ మొత్తం విడుదల కాకపోవడంతో.. ప్రైవేట్ కళాశాలలు భవన అద్దె, సిబ్బంది జీతాలు చెల్లించలేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. నిలదొక్కుకునేందుకు పలు కళాశాలలు రూ.కోటి నుంచి రూ.4 కోట్ల వరకు అప్పు తీసుకున్నాయని అసోసియేషన్ సభ్యులు చెబుతున్నారు.

☛➤ Schools Holidays Due To Heavy Rain : స్కూల్స్‌కు సెలవులు ప్ర‌క‌టించిన వివిధ జిల్లా కలెక్టర్లు.. ఇంకా మ‌రో రెండు రోజులు కూడా..

ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి..
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం జాప్యం చేస్తోందని.. ప్రైవేట్ డిగ్రీ, పీజీ కళాశాలల నిర్వాహకులు సమైక్య నిరసన చేస్తున్నారు. గత మూడేళ్లుగా పెండింగ్‌లో ఉన్న తమ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 900 కళాశాలల నిర్వాహకులు జూన్ నెలలో ఇందిరాపార్క్‌ వద్ద ఆందోళన చేపట్టారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కింద ప్రైవేటు కాలేజీలకు ప్రభుత్వం వేల కోట్ల రూపాయల బకాయి పడిందని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి 2024 జులై 14న వ్యాఖ్యానించారు.

ప్రతి పేదవాడి బిడ్డకు కార్పొరేట్‌ విద్యను అందించాలనే ఉద్దేశంతో...

ఆ బకాయిలను వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ కింద చెల్లించాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. కాలేజీల యాజమాన్య ప్రతినిధులందరూ కలిసి వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌కు ప్రతిపాదనలు ఇస్తే.. సమస్యను త్వరగా పరిష్కరించే బాధ్యతను ఐటీ మంత్రి శ్రీధర్‌బాబుకు అప్పగిస్తున్నానని స్పష్టం చేశారు. ఈ విద్యా సంవత్సరం నుంచి ఒక్క రూపాయి కూడా బకాయి పడకుండా సకాలంలో ఫీజు చెల్లింపులు చేస్తామని రేవంత్ హామీ ఇచ్చారు. ప్రతి పేదవాడి బిడ్డకు కార్పొరేట్‌ విద్యను అందించాలనే ఉద్దేశంతో... కాంగ్రెస్‌ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని ప్రవేశపెట్టిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

2024-25 విద్యాసంవత్సరంలో ముఖ్యమైన‌ సెలవులు ఇవే...

➤☛ క్రిస్టియన్ మైనార్టీ విద్యాసంస్థలకు దసరా సెలవులు అక్టోబరు 11 నుంచి 13 వరకు ఉంటాయి.
➤☛ అక్టోబరు 31న దీపావళి సెలవు
➤☛ డిసెంబరు 25న క్రిస్మస్, క్రిస్టియన్ మైనార్టీ విద్యాసంస్థలకు క్రిస్మస్ సెలవులు డిసెంబరు 20 నుంచి 29 వరకు.
➤☛ సంక్రాంతి సెలవులు వచ్చే ఏడాది జనవరి 10 నుంచి 19 వరకు

కాలేజీలు బంద్ చేస్తే క‌ఠిన చ‌ర్య‌లు...
తెలంగాణ‌లోని ప్రైవేటు డిగ్రీ, పీజీ కాలేజీలు నిరవధికంగా బంద్ చేస్తే చర్యలు తప్పవని ఉస్మానియా యూనివ‌ర్శిటీ రిజిస్ట్రార్ లక్ష్మీనారాయణ హెచ్చరించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల కాలేదని పలు కాలేజీల యాజమాన్యాలు నిరవధికంగా బంద్ చేస్తామని హెచ్చరించడంతో ఆయన స్పందించారు. డిగ్రీ, పీజీ అకడమిక్ సెమిస్టర్ పరీక్షలు, గ్రూప్ 1,2,3 ఉద్యోగాలు, ఇతర రాత పరీక్షలు ఉన్నందున కాలేజీలు బంద్ చేస్తే విద్యార్థులు, నిరుద్యోగులు నష్టపోతారని చెప్పారు.

Published date : 14 Oct 2024 01:43PM

Photo Stories