Skip to main content

Telangana College Bandh 2024 : వ‌రుస‌గా కాలేజీలు బంద్... మొత్తం ఎన్ని రోజులంటే...?

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ‌లో అక్టోబ‌ర్ 15వ తేదీ నుంచి కాలేజీలకు బంద్ ప్ర‌క‌టించారు కాలేజీల యజమానులు. గ‌త మూడేళ్లుగా ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించకపోవడంతో కళాశాలలు నడపలేకపోతున్నామని డిగ్రీ కాలేజీల మేనేజ్‌మెంట్ అసోసియేషన్ తెలిపింది.
telangana degree college bandh

ఉద్యోగుల జీతాలు, భవనాల అద్దెలు, విద్యుత్ బిల్లులు చెల్లించలేక సతమతమవుతున్నట్లు పేర్కొంది. తప్పనిసరి పరిస్థితుల్లోనే బంద్‌కు పిలుపునిచ్చినట్లు తెలిపింది. ప్రభుత్వం వెంటనే కాలేజీల  బకాయిలను విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. జిల్లాల వారిగా డిగ్రీ, పీజీ కాలేజీలను యజమానులు మూసివేశారు. కళాశాలల యజమానులు నిరవధిక బంద్‌ నిర్వహించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో రూ.120కోట్ల బకాయిలు ఉన్నాయని యజమానులు చెబుతున్నారు. కాలేజీల యజమానులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపడుతున్నారు. మూడేళ్లుగా రూ.2400 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు ఉన్నాయని యజమానులు తెలిపారు. 

దాదాపు 25వేల మంది నిరుద్యోగులు స్వయం ఉపాధి కోసం..
తెలంగాణ సెక్రెటేరియెట్​లో విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశానికి వినతిపత్రం అందించారు. అనంతరం బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు  ఆర్​.కృష్ణయ్యను కలిసి బంద్​కు మద్దతు కోరారు. అనంతరం వారు మాట్లాడుతూ.. సుమారు 25వేల మంది నిరుద్యోగులు స్వయం ఉపాధి కోసం వివిధ రకాల విద్యాసంస్థలను స్థాపించి, సుమారు 2 లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నట్టు చెప్పారు. ఏటా సుమారు 2,500 కోట్లు ఫీజు రీయింబర్స్ మెంట్ కింద కాలేజీలకు సర్కారు కేటాయిస్తుందన్నారు. 

☛➤ Schools and Colleges Holidays Due to Heavy Rain 2024 : రానున్న మూడు రోజులు విద్యాసంస్థలకు సెల‌వులు.. అలాగే..

కొత్త అప్పులు దొరక్క కాలేజీల నిర్వహణ భారంగా..

ts degree colleges bandh news telugu

అయితే,  2021–22 సంవత్సరంలో 20% , 2022–23 లో 70%,  2023–24 లో పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయని చెప్పారు. సుమారు పదినెలల నుంచి రూ.1200 కోట్ల బకాయిలకు సంబంధించి టోకెన్లు రిలీజ్ చేసి, ఇప్పటికీ నిధులు మాత్రం కాలేజీల ఖాతాల్లో జమ చేయలేదని తెలిపారు.దీంతో అద్దెలు, సిబ్బంది జీతాలు చెల్లించలేక అవస్థలు పడుతున్నామని, తెచ్చిన అప్పులు కట్టలేక.. కొత్త అప్పులు దొరక్క కాలేజీల నిర్వహణ భారంగా మారిందని పేర్కొన్నారు. ఇప్పటికే తమ పరిస్థితిపై అన్ని వర్సిటీల రిజిస్ట్రార్లతో పాటు స్టేట్ కౌన్సిల్ అధికారులకు సమాచారం ఇచ్చినట్టు చెప్పారు. 

విధిలేని పరిస్థితిలోనే కాలేజీలను..
విధిలేని పరిస్థితిలోనే కాలేజీలు బంద్ చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి, సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. కాగా, ఫీజు రీయింబర్స్ మెంట్​ బకాయిలను వెంటనే రిలీజ్ చేయాలని, లేకపోతే ఆందోళనలు చేపడ్తామని ఎస్​ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆర్ఎల్​ మూర్తి, నాగరాజు, ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీ వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు.

ఈ నిర‌వ‌ధిక కాలేజీల బంద్ ఎన్ని రోజులు వ‌ర‌కు ఉంటుంద‌నేది ఇంకా క్లారిటీ రాలేదు. ప్ర‌భుత్వం స్పందించి ఫీజు రీయింబర్స్ మెంట్​ బకాయిలను విడుద‌ల చేసే వ‌ర‌కు ఈ కాలేజీలు బంద్ ఉండే అవ‌కాశం ఉంది.

Published date : 16 Oct 2024 08:32AM

Photo Stories