Skip to main content

Schools and Colleges Bandh On August 21st 2024 : ఎల్లుండి స్కూల్స్, కాలేజీలు బంద్‌.. ? ఎందుకంటే..?

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఆగ‌స్టు నెల‌లో స్కూల్స్‌, కాలేజీ విద్యార్థులకు సెల‌వుల మీద సెల‌వులు వస్తూనే ఉన్నాయి. ఒక విధంగా చెప్పాలంటే.. ఈ నెల విద్యార్థుల‌కు పండ‌గే అని చెప్పోచ్చు. ఎందుకంటే.. ఒక వైపు పండ‌గ సెల‌వులు.. మ‌రో వైపు బంద్‌లు.., భారీ వ‌ర్షాలతో స్కూల్స్‌, కాలేజీల‌కు వ‌రుస‌గా సెల‌వులు వ‌స్తున్నాయి.
Schools and Colleges Bandh

ఇటీవ‌లే వ‌రుస‌గా ఐదు రోజులు పాటు సెల‌వులు వ‌చ్చిన విష‌యం తెల్సిందే. ఇప్పుడు తాజాగా ఆగ‌స్టు 21వ తేదీన (బుధ‌వారం) స్కూల్స‌, కాలేజీల‌కు మ‌రో సెల‌వు వ‌చ్చే అవ‌కాశం ఉంది.

☛➤ August 25, 26th Holidays 2024 : ఆగస్టు 25, 26న విద్యా సంస్థలకు సెలవులు.. ఎందుకంటే..?

ఎస్సీ, ఎస్టీ వర్గీకరణను వ్యతిరేకిస్తు..
ఎస్సీ, ఎస్టీ వర్గీకరణను సమర్థిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కొందరు ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు. మరికొంతమంది మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై బహుజన సంఘాల్లో తీవ్ర వ్యతిరేత వ్యక్తం అవుతోంది. షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, రిజర్వేషన్ కేటగిరీలలో ఉపవర్గీకరణలను అనుమతిస్తూ ఈమధ్యే సుప్రీంకోర్టు తీర్పును ఇచ్చింది. ఈ రెండు వర్గాల్లో ఉపవర్గీకరణ చేపట్టాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలకు నిరసనగా ఆగ‌స్టు 21వ తేదీన (బుధ‌వారం) భారత్ బంద్‌కు పిలుపునిచ్చాయి. ఎస్సీ, ఎస్టీ వర్గకరణకు అనుమతిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ కూడా వ్యతిరేకించారు. దీంతో దేశవ్యాప్తంగా ఆందోళనలను మొదలవుతున్నాయి.

ఈ బంద్‌లో..
ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ.. ఆగ‌స్టు 21వ తేదీ (బుధ‌వారం) భారత్ బంద్‌కు SC వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి పిలుపునిచ్చింది. ఈ తీర్పుతో తమ హక్కులకు భంగం వాటిల్లుతోందని సమితి కన్వీనర్ సర్వయ్య, కో-కన్వీనర్ చెన్నయ్య అన్నారు. రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్న ఈ తీర్పును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎల్లుండి జరిగే ఈ బంద్‌లో SC, ST సంఘాలు, ఉద్యోగ, విద్యార్థి, మహిళలు పాల్గొనాలని కోరారు.

ఇదే రోజు..
భీమ్ సేన, ట్రైబల్ ఆర్మీ చీఫ్ బంద్‌ పిలుపునకు పలు సంఘాలు కూడా మద్దతు ప్రకటించాయి. ఈ తీర్పు ఎస్సీ, ఎస్టీల్లోని ఐక్యతను దెబ్బతీసే విధంగా ఉందని మండిపడుతున్నాయి. దీంతో ఆగ‌స్టు 21వ తేదీ(బుధ‌వారం) దేశంలోని అన్ని పాఠశాలలు, కాలేజీల యాజమాన్యాలు సెలవు ప్రకటించే అవ‌కాశం ఉంది. దీంతో విద్యార్థులకు ఈ నెలలో అదనంగా మరో రోజు సెలవు జత కానుంది.

ఆగ‌స్టు 26వ తేదీ కూడా స్కూల్స్ సెల‌వు..
ఆగ‌స్టు 26వ తేదీ (సోమవారం) శ్రీ కృష్ణాష్టమి పండ‌గ‌. ఈ రోజులు కూడా అన్ని స్కూల్స్ ,కాలేజీలు సెల‌వులు ఉంటుంది. దాదాపు 2024 ఆగ‌స్టు నెల‌లో స్కూల్స్‌, కాలేజీల‌కు 10 రోజులు వ‌ర‌కు సెల‌వులు రానున్నాయి. అలాగే ఏమైన బంద్‌లు, భారీ వ‌ర్షాల వ‌ల్ల స్కూల్స్‌, కాలేజీల‌కు సెల‌వులు వ‌చ్చే అవ‌కాశం ఉంది. తాజాగా ఈ సెల‌వుల జాబితాలో మరో రోజు అనుకోని సెలవు బంద్ రూపంలో జత అయ్యింది.

2024లో Schools & Colleges సెల‌వులు వివ‌రాలు ఇవే...

☛ 19-08-2024 (సోమవారం) రాఖీ పండగ
☛ 26-08-2024 (సోమవారం) శ్రీ కృష్ణాష్టమి
☛07-09-2024 (శనివారం) వినాయకచవితి
☛ 16-09-2024 (సోమవారం) ఈద్ మిలాద్ ఉన్ నబి
☛ 02-10-2024 (బుధవారం) గాంధీ జయంతి
☛ 11-10-2024 (శుక్రవారం) దుర్గాష్టమి
☛ 31-10-2024 (గురువారం) దీపావళి
☛ 25-12-2024 (బుధవారం) క్రిస్మస్

2024-25 విద్యాసంవత్సరంలో ముఖ్యమైన‌ సెలవులు ఇవే..

➤☛ దసరా సెలవులు అక్టోబరు 4 నుంచి 13 వరకు ఉండనున్నాయి.
➤☛ క్రిస్టియన్ మైనార్టీ విద్యాసంస్థలకు దసరా సెలవులు అక్టోబరు 11 నుంచి 13 వరకు ఉంటాయి.
➤☛ అక్టోబరు 31న దీపావళి సెలవు
➤☛ డిసెంబరు 25న క్రిస్మస్, క్రిస్టియన్ మైనార్టీ విద్యాసంస్థలకు క్రిస్మస్ సెలవులు డిసెంబరు 20 నుంచి 29 వరకు.
➤☛ సంక్రాంతి సెలవులు వచ్చే ఏడాది జనవరి 10 నుంచి 19 వరకు.

Published date : 19 Aug 2024 04:28PM

Photo Stories