Skip to main content

TET Free training : టెట్‌కి ఉచితంగా శిక్షణ.. పూర్తి వివరాలివే!

కొత్తపల్లి(కరీంనగర్‌): వీఎన్‌ఆర్‌ క్లాసెస్‌ ఆధ్వర్యంలో కరీంనగర్‌లోని టీఎన్‌జీవోస్‌ ఫంక్షన్‌ హాల్‌లో టెట్‌ అభ్యర్థులకు ఉచిత శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు అల్ఫోర్స్‌ విద్యా సంస్థల చైర్మన్‌ డా.వి.నరేందర్‌రెడ్డి తెలిపారు. సోమవారం కొత్తపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో టెట్‌ శిక్షణకు సంబంధించి పోస్టర్‌ ఆవిష్కరించి మాట్లాడారు.
TET Free training  Free TET training classes announcement at TNGOs function hall, Karimnagar  VNR Classes organizing TET training in Karimnagar
TET Free training

అల్ఫోర్స్‌ విద్యా సంస్థల ఆధ్వర్యంలో ఐఐటీ/నీట్‌లో శిక్షణ ఇస్తున్న మాదిరిగానే టెట్‌ అభ్యర్థులకు శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. అలాగే అల్ఫోర్స్‌ ఈ క్లాసెస్‌ యాప్‌ ద్వారా ఆన్‌లైన్‌లో ఉచిత తరగతులు నిర్వహిస్తున్నట్లు, ఇందులో ఇప్పటికే 50 వేల మంది అభ్యర్థులు రిజిస్టర్‌ చేసుకున్నట్లు వివరించారు.

Certificate Course: మహిళలకు ఉచితంగా నాన్‌ వాయిస్‌ సర్టిఫికెట్‌ కోర్సు..

56 కాంపిటేటివ్‌ ఎగ్జామ్స్‌కు సంబంధించి స్టడీ మెటీరియల్‌ ఉంచినట్లు వెల్లడించారు. తరగతులకు హాజరయ్యే అభ్యర్థులు మంగళ, బుధవారాల్లో ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని, ఇందులో ఎంపిక చేసినవారికి తరగతులు నిర్వహిస్తామని వెల్లడించారు.

Free Training: నిరుద్యోగ యువతకు ఉచితంగా ఉపాధి కోర్సులలో శిక్షణ

ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగే తరగతులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇందుకు సహకరించిన కిడ్స్‌ ట్యూటోరియల్‌ నిర్వాహకులు సత్యం, టీచర్స్‌ అకాడమీ నిర్వాహకుడు చందుకు నరేందర్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

Published date : 04 Dec 2024 09:26AM

Photo Stories