Skip to main content

TET 2024 Candidates : ప్రారంభం కానున్న టెట్ ప‌రీక్ష‌లు.. ఇప్ప‌టికీ తప్పని తిప్పలు!!

వ‌చ్చే ఏడాది, జ‌న‌వ‌రిలో ప్రారంభం కానున్న టెట్ ప‌రీక్ష‌ల అభ్య‌ర్థులు హాల్ టికెట్ ను ప‌రిశీలించుకున్న త‌రువాత ఆందోళ‌నకు దిగారు.
TS tet 2024 candidates struggles and high tension with exam centers   TET exam centers allocation in Telangana January 2024  Telangana TET exam challenges January 2024 Exam preparation and allocation issues for TET candidates

సాక్షి ఎడ్యుకేష‌న్: తెలంగాణ‌లో వ‌చ్చే ఏడాది, అంటే.. జ‌న‌వ‌రిలో టెట్ ప‌రీక్ష‌లు ప్రారంభం కానున్నాయి. ఒక‌వైపు ప‌రీక్ష‌లు ద‌గ్గ‌ర ప‌డుతున్నాయి, మ‌రోవైపు ఇప్ప‌టికీ అభ్య‌ర్థుల్లో కొంద‌రికి వివిధ ర‌కాల తిప్ప‌లు త‌ప్ప‌డం లేదు. అస‌లు విష‌యం ఏంటంటే.. అభ్య‌ర్థులు వారు పెట్టుకున్న ఫస్ట్ ప్రయార్టీ జిల్లాల్లో కాకుండా.. చివరి ప్రయార్టీ జిల్లాల్లో ఎగ్జామ్ సెంటర్లు కేటాయించడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

TET 2024 Hall Ticket Download : టెట్ హాల్‌టికెట్ డౌన్‌లోడ్ విధానం ఇలా.. ఏదైనా స‌మ‌స్య ఉంటే ఇలా చేయండి..

న‌మోదు ఒక‌టి.. కేటాయింపు మ‌రొక‌టి..

గురువారం అంటే, డిసెంబ‌ర్ 26వ తేదీన‌ రాత్రి టెట్ హాల్ టికెట్లను అభ్యర్థులకు వెబ్ సైట్​లో అందుబాటులో పెట్టారు. వీటికి ప‌రిశీలించుకున్న అనేక‌మంది అభ్య‌ర్థులు షాక్ కు గురయ్యారు. కార‌ణం.. టెట్ పరీక్షా కేంద్రాలు వారుంటున్న ప్రాంతాలకు దూరంగా పడ్డాయని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. కనీసం ఉమ్మడి జిల్లాలోనైనా అవకాశం ఇవ్వకుండా.. 100 కిలోమీటర్ల దూరంలో సెంటర్లు వేశారని ఆరోపిస్తున్నారు టెట్ అభ్య‌ర్థులు.

Guest Teacher Posts : ఈ పాఠ‌శాల‌లో గెస్ట్ టీచ‌ర్ పోస్టులు.. ఈ తేదీలోగా..!

ఖమ్మం జిల్లాకు చెందిన ఓ అభ్యర్థి.. 16 పరీక్షా కేంద్రాలకు ఆప్షన్లు ఇచ్చుకోగా, అతను ఆప్షనే పెట్టని హన్మకొండలో సెంటర్ పడింది. అదే జిల్లాకు చెందిన ఓ మహిళా అభ్యర్థికి.. 11వ ఆప్షన్​గా పెట్టుకున్న సిద్దిపేట జిల్లాలో సెంటర్ వేశారు. వేలాది మందికి ఇలాంటి పరిస్థితే ఏర్పడింది. ఇప్పుడే తిప్ప‌లు ప్రారంభం అయ్యాయా.. అని అభ్య‌ర్థులు ఆందోళ‌న చెందుతున్నారు.

అభ్య‌ర్థుల ఆందోళ‌న‌..

ఈ ప‌రీక్ష‌ను 20 సెషన్లలో ఏర్పాటు చేసినా.. కనీసం ఉమ్మడి జిల్లాల్లో కూడా సెంటర్లను కేటాయించకపోవడంపై అభ్యర్థులు మండిపడుతున్నారు. దీని ప్రభావం అటెండెన్స్​ పై పడే అవకాశం ఎక్కువ‌గా ఉంది. కాగా.. జనవరి 11, 20వ తేదీల్లో జరిగే టెట్ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లు సాంకేతిక కారణాలతో గురువారం రాత్రి వెబ్ సైట్లో పెట్టలేదు. వారి హాల్ టికెట్లను ఆదివారం వెబ్ సైట్​లో పెడ్తామని అధికారులు ప్రకటించారు. ఇక‌, జనవరి 20 వరకూ టెట్ ఎగ్జామ్స్ జరగనున్నాయన్న విష‌యం తెలిసిందే. ఈ ప‌రీక్ష‌లు పూర్తిగా పదిరోజుల పాటు 20 సెషన్లలో జరగ‌నున్నాయి. దీనికి 2,75,773 మంది అభ్య‌ర్థులు పరీక్షలు రాయనున్నారు.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 28 Dec 2024 12:44PM

Photo Stories