TS TET 2024(2) : టీఎస్ టెట్–2024(2) నోటిఫికేషన్ విడుదల.. పరీక్షల తేదీలు ఇవే!
డీఎస్సీ నియామకాలకు తప్పనిసరి అర్హత టెట్! ఇందులో విజయం సాధిస్తే భవిష్యత్తులో నిర్వహించనున్న డీఎస్సీ (టీచర్ రిక్రూట్‌మెంట్ టెస్ట్)కు అర్హతతోపాటు వెయిటేజీ సైతం లభిస్తుంది. తాజాగా తెలంగాణలో టెట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నేపథ్యంలో.. టీఎస్ టెట్– 2024(2) నోటిఫికేషన్ వివరాలు, పరీక్ష విధానం, ప్రిపరేషన్ తదితర సమాచారం..
నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్(ఎన్‌సీటీఈ) నిబంధనల ప్రకారం–టీచర్ రిక్రూట్‌మెంట్ టెస్ట్‌కు హాజరు కావాలంటే.. బీఈడీ, డీఈడీలతోపాటు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్)లో ఉత్తీర్ణత తప్పనిసరి. అప్పుడే టీఆర్‌టీకి దరఖాస్తుకు అవకాశం లభిస్తుంది. టీచర్ పోస్ట్‌ల భర్తీలో టెట్ స్కోర్‌కు వెయిటేజీ కల్పిస్తారు. టీచర్ రిక్రూట్‌మెంట్ టెస్ట్‌కు 80 శాతం, టెట్ స్కోర్‌కు 20 శాతం వెయిటేజీ ఉంటుంది.కాబట్టి అభ్యర్థులు టెట్‌లో ఉత్తీర్ణత పొందేలా కృషి చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
HAL Recruitments : హెచ్‌ఏఎల్‌లో నాలుగేళ్ల ఒప్పంద ప్రాతిపదికన ఈ పోస్టుల్లో భర్తీకి దరఖాస్తులు
రెండు పేపర్లుగా టెట్
➤ డీఈడీ, బీఈడీ అర్హతతో నిర్వహించనున్న టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(టెట్)లో రెండు పేపర్లు ఉంటాయి. అవి.. పేపర్–1, పేపర్–2.
➤ పేపర్–1: ఒకటి నుంచి అయిదో తరగతి వరకు బోధించేందుకు, ఎస్‌జీటీ పోస్ట్‌ల అభ్యర్థులు పేపర్ 1కు హాజరవుతారు. ఇంటర్మీడియెట్/తత్సమాన కోర్సులో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణతతోపాటు రెండేళ్ల డిప్లామా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ లేదా నాలుగేళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ లేదా రెండేళ్ల డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్(స్పెషల్ ఎడ్యుకేషన్) పాసైన వారు పేపర్–1కు దరఖాస్తు చేసుకోవచ్చు.
➤ పేపర్–2: ఆరు నుంచి ఎనిమిదో తరగతి వరకు బోధించేందుకు, స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు ప్రామాణిక పరీక్ష టెట్ పేపర్–2. బీఏ/బీఎస్సీ/బీకాంలలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణతతోపాటు బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఈడీ) లేదా బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (స్పెషల్ ఎడ్యుకేషన్) లేదా నాలుగేళ్ల బీఏ ఎడ్యుకేషన్/బీఎస్సీ ఎడ్యుకేషన్‌లలో ఉత్తీర్ణత లేదా నాలుగేళ్ల బీఏ బీఈడీ/బీఎస్సీ బీఈడీలలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులవ్వాలి.
☛Follow our YouTube Channel (Click Here)
➤ లాంగ్వేజ్ పండిట్ పోస్ట్‌ల అభ్యర్థులు సంబంధిత లాంగ్వేజ్ ఆప్షనల్ సబ్జెక్ట్‌గా బ్యాచిలర్ డిగ్రీ లేదా బ్యాచిలర్ ఆఫ్ ఓరియెంటల్ లాంగ్వేజ్/లిటరేచర్‌లో బ్యాచిలర్ లేదా పీజీ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దీంతోపాటు లాంగ్వేజ్ పండిట్ ట్రైనింగ్ సర్టిఫికెట్ లేదా సంబంధిత లాంగ్వేజ్ మెథడాలజీలో బీఈడీ ఉత్తీర్ణత పొందాలి. (లేదా) బీఈ/బీటెక్‌లో 50 శాతంతో ఉత్తీర్ణత సాధించి బీఈడీ/బీఈడీ (స్పెషల్ ఎడ్యుకేషన్ చదువుతున్న వారు కూడా అర్హులే. ఆయా కోర్సుల చివరి సంవత్సరం విద్యార్థులు సైతంటెట్ పేపర్లకు దరఖాస్తు చేసుకోవచ్చు.
150 మార్కులకు పేపర్–1
టెట్ పేపర్–1ను అయిదు విభాగాల్లో 150 ప్రశ్నలు–150 మార్కులకు కంప్యూటర్ బేస్డ్ విధానంలో నిర్వహిస్తారు.అవి..చైల్డ్ డెవలప్‌మెంట్ అండ్ పెడగాజి(30 ప్రశ్నలు–30 మార్కులు), లాంగ్వేజ్–1(30 ప్రశ్నలు–30 మార్కులు), లాంగ్వేజ్–2 (30 ప్రశ్నలు–30 మార్కులు), మ్యాథమెటిక్స్ (30 ప్ర.–30 మా.), ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్ (30 ప్ర.–30 మా.) నుంచి ప్రశ్నలు అడుగుతారు. ప్రతి విభాగంలో ఆరు ప్రశ్నలు పెడగాజీ నుంచి ఉంటాయి.
పేపర్–2
టెట్ పేపర్–2ను కూడా నాలుగు విభాగాలుగా 150 ప్రశ్నలు–150 మార్కులకు కంప్యూటర్ బేస్డ్ విధానంలో నిర్వహిస్తారు. ఈ పేపర్ పూర్తిగా బహుళైచ్ఛిక ప్రశ్నలతో ఆబ్జెక్టివ్ విధానంలో జరుగుతుంది. ఇందులో చైల్డ్ డెవలప్‌మెంట్ అండ్ పెడగాజి 30 ప్రశ్నలు–30 మార్కులకు; లాంగ్వేజ్1, 30 ప్రశ్నలు–30 మార్కులకు; లాంగ్వేజ్ 2, (ఇంగ్లిష్) 30 ప్రశ్నలు–30 మార్కులకు; సంబంధిత సబ్జెక్ట్ 60ప్రశ్నలు–60 మార్కులకు ఉంటాయి. నాలుగో విభాగంలో మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ టీచర్స్ అభ్యర్థులు మ్యాథ్స్,సైన్స్ విభాగాన్ని.. సోషల్ టీచర్లు సోషల్ స్టడీస్ విభాగాన్ని ఎంచుకుని పరీక్ష రాయాలి.
కనీస అర్హత మార్కులు
రెండు పేపర్లుగా నిర్వహించే టెట్ పేపర్–1, పేపర్–2లలో అభ్యర్థులు తప్పనిసరిగా కనీస అర్హత మార్కులు సాధించాలనే నిబంధన విధించారు. జనరల్ కేటగిరీ అభ్యర్థులు కనీసం అరవై శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. బీసీ కేటగిరీ అభ్యర్థులు 50 శాతం, ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగుల కేటగిరీలకు చెందిన అభ్యర్థులు 40 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. ఈ మార్కులు సాధించిన వారికే టెట్ సర్టిఫికెట్లు జారీ చేస్తారు.
☛ Follow our Instagram Page (Click Here)
ముఖ్య సమాచారం
➤ దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
➤ దరఖాస్తు చివరి తేదీ: 2024, నవంబర్ 20
➤ హాల్ టికెట్ డౌన్‌లోడ్: 2024, డిసెంబర్ 26 నుంచి
➤ టెట్ తేదీలు: 2025 జనవరి 1 నుంచి 20 వరకు(పేపర్ 1 ఉదయం 9 నుంచి 11:30 వరకు; పేపర్–2 మధ్యాహ్నం 2 నుంచి 4:30 వరకు).
➤ ఫలితాల వెల్లడి: 2025, ఫిబ్రవరి 5
➤ వివరాలకు వెబ్‌సైట్: https://schooledu.telangana.gov.in, https://tgtet2024.aptonline.in/tgtet
మంచి స్కోర్ సాధించాలంటే
పేపర్–1కు ఇలా
చైల్డ్ డెవలప్‌మెంట్ అండ్ పెడగాజిలో బోధన, లెర్నింగ్‌కు సంబంధించిన ఎడ్యుకేషనల్ సైకాలజీపై ప్రాథమిక స్థాయిలో ప్రశ్నలు ఉంటాయి. అభ్యర్థులు ప్రధానంగా శిశువు సైకాలజీ సంబంధించిన అంశాలపై ఎక్కువగా దృష్టిసారించాలి. వికాస దశలు, వికాస అంశాలైన శారీరక, మానసిక, సాంఘిక, ఉద్వేగ వికాసాలు మొదలైన అంశాలను క్షుణ్నంగా చదవాలి. సైకాలజీ అంశాలను చదివేటప్పుడు కీలక భావనలు, సాంకేతిక పదాలు, సిద్ధాంతాలు–సూత్రాలు, ప్రతిపాదించిన శాస్త్రవేత్తలు, వారి గ్రంథాలు తదితర విషయాలను విశ్లేషణాత్మకంగా చదవాలి. పెడగాజి అంటే బోధన శాస్త్రం.
Act Apprentice Posts : ఆర్‌ఆర్‌సీలో యాక్ట్ అప్రెంటీస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు.. అర్హులు వీరే!
ఇందులో సహిత విద్య, శిశువు విద్యా ప్రణాళిక, బోధన పద్ధతులు, మూల్యాంకనం–నాయకత్వం–గైడెన్స్–కౌన్సెలింగ్ గురించి అధ్యయనం చేయాలి. ఎడ్యుకేషన్‌కు సంబంధించిన చట్టాలపై పూర్తి అవగాహన పొందాలి. పెడగాజిలోని భావనలు, సిద్ధాంతాలు, నిబంధనలను విశ్లేషిస్తూ అధ్యయనం చేయాలి.
మ్యాథమెటిక్స్, ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్
ఇందులో ఒకటి నుంచి అయిదో తరగతి స్థాయి వరకు ప్రశ్నలు ఉంటాయి. క్లిష్టత స్థాయి పదో తరగతి వరకు ఉండే అవకాశం ఉంది. ఆయా సబ్జెక్టుల్లో ఒక్కో సబ్జెక్టుకు కేటాయించే 30 ప్రశ్నల్లో 24 ప్రశ్నలు కంటెంట్‌పై, మిగతా 6 ప్రశ్నలు పెడగాజిపై ఉంటాయి. పేపర్–2లో మ్యాథమెటిక్స్, సైన్స్‌పై ప్రశ్నలు అడుగుతారు. ఆరో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు ఉండే కాన్సెప్టులపై ప్రశ్నలు ఎదురవుతాయి. ప్రశ్నల క్లిష్టత ఇంటర్ స్థాయిలో ఉంటుంది. ఎన్విరాన్‌మెంటల్ పేపర్‌లో సైన్స్, తెలంగాణ నుంచి ప్రశ్నలు తప్పనిసరిగా ఉంటున్నాయి. కాబట్టి అభ్యర్థులు తెలంగాణ ప్రాముఖ్యం ఉన్న అంశాలను ప్రత్యేక దృష్టితో చదవడం ఉపయుక్తంగా ఉంటుంది.
పేపర్–2 ప్రిపరేషన్
➤ సైన్స్: ఈ విభాగంలో మార్కుల కోసం మూడు నుంచి ఎనిమిదో తరగతి వరకు పుస్తకాలు ఔపోసన పట్టాలి. గత టెట్‌లో ఈ విభాగంలో ప్రశ్నలు కాసింత క్లిష్టంగానే ఉన్నాయని చెప్పొచ్చు.
☛ Join our WhatsApp Channel (Click Here)
➤ సోషల్ స్టడీస్: ఆరు నుంచి ఎనిమిదో తరగతి వరకు పాఠ్య పుస్తకాలను క్షుణ్నంగా చదవాలి. భూగోళ శాస్త్రంలో ఒక ప్రాంతం గురించి చదువుతున్నప్పుడు ఆ ప్రాంతానికి సంబంధించిన అన్ని అంశాలను చదివాలి. వాతావరణ, భౌగోళిక పరిస్థితులు, నదులు వంటి వాటిపై అవగాహన పెంచుకోవాలి. అదేవిధంగా సివిక్స్, ఎకనామిక్స్ అంశాలను సమకాలీన అంశాలతో అప్‌డేట్ చేసుకుంటూ అధ్యయనం చేయాలి.
➤ మ్యాథమెటిక్స్: ఈ సబ్జెక్ట్‌లోనూ ఆరు నుంచి ఎనిమిదో తరగతి వరకు మ్యాథమెటిక్స్ పుస్తకాలను అధ్యయనం చేయాల్సిన విధంగా ప్రశ్నలు అడుగుతారు. ట్రిగ్నోమెట్రీ, జామెట్రీ, కో–ఆర్డినేట్ జామెట్రీ, అల్జీబ్రా, కాలిక్యులస్ వంటి కీలక సబ్జెక్ట్‌ల కాన్సెప్ట్‌లను అర్థం చేసుకుంటూ ప్రాక్టీస్ చేయాలి.
➤ మెథడాలజీ: ఇందులో ప్రధానంగా బోధనా పద్ధతులు; టీచర్ లెర్నింగ్ మెటీరియల్(టీఎల్‌ఎం); బోధన ఉద్దేశాలు, విలువలు, లక్ష్యాలను చదవాలి.పేపర్–1,పేపర్–2లో అడిగే అంశాలు ఒక్కటే అయినా.. వాటి క్లిష్టత స్థాయిలో తేడా ఉంటుంది. దీన్ని గుర్తించి ప్రిపరేషన్ కొనసాగించాలి.
టైమ్ మేనేజ్‌మెంట్
➤ గత ప్రశ్నపత్రాలను పరిశీలిస్తూ.. ఇంగ్లిష్, తెలుగు, పెడగాజి విభాగాన్ని అధ్యయనం చేసి బిట్స్ ఎక్కువ సంఖ్యలో ప్రాక్టీస్ చేయాలి. కంటెంట్‌కు సంబంధించి పేపర్–1 అభ్యర్థులు మూడు నుంచి అయిదో తరగతి వరకు పాఠ్యపుస్తకాల్లోని ముఖ్యాంశాలను రివిజన్ చేయాలి.
Good news for Anganwadis: అంగన్‌వాడీలకు గుడ్‌న్యూస్ ఇక నుంచి వీరికి...
➤ పేపర్–2 అభ్యర్థులు కంటెంట్ కోసం 6, 7, 8 తరగతుల పాఠ్యపుస్తకాల్లోని కీలకాంశాలను చదవాలి. కంటెంట్‌కు సంబంధించి ఎక్కువగా సమాచార ఆధారిత ప్రశ్నలే ఉంటాయి. కాబట్టి అభ్యర్థులు జ్ఞాపకశక్తిని పెంపొందించుకునేందుకు ప్రాధాన్యం ఇవ్వాలి.
➤ టెట్‌లో కాసింత క్లిష్టమైన విభాగం మెథడాలజీ. ఇందులో ఎక్కువ మార్కులు సాధించాలంటే లక్ష్యాలు, బోధనా పద్ధతులు, బోధనోపకరణాలు, మూల్యాంకనం, కరిక్యులం అంశాలపై ఎక్కువ దృష్టిసారించాలి.
➤ ముఖ్యంగా పేపర్ –2 సోషల్ స్టడీస్ అభ్యర్థులు తెలంగాణ అంశాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలి.
➤ పరీక్షకు ముందు వేగంగా రివిజన్ చేసుకునేలా షార్ట్‌నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి.
➤ ముఖ్యంగా పెడగాజీ, మెథడాలజీలకు ఇలాంటి నోట్స్ వల్ల అధిక ప్రయోజనం ఉంటుంది.
Tags
- ts tet 2024
- notifications 2024
- tet notification 2024
- ts tet paper 2 2024
- exam dates for ts tet 2024
- ts tet exam schedule
- DSC candidates
- tet exam eligibles
- ts tet paper 2 exam schedule
- TS TET Exam Dates
- tet paper 2 preparation
- TET Paper 1
- ts tet paper 2 registrations
- exam dates for ts tet paper 2
- Teaching Posts
- Teacher Eligibility Test
- ts tet 2024 paper 2 exam schedule
- Education News
- Sakshi Education News