Skip to main content

TG TET 2024 Application Process Postponed: తెలంగాణ టెట్‌ దరఖాస్తు స్వీకరణ వాయిదా.. పూర్తి వివరాలివే

తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌)దరఖాస్తుల స్వీకరణ వాయిదా పడింది. మంగళవారమే దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉండగా,సాంకేతిక కారణాలతో గురువారానికి వాయిదా పడింది.
TG TET 2024 Application Process Postponed  Teacher Eligibility Test (TET) application postponement notice in Telangana   Telangana Education Department announces new TET application start date  TET application deadline extended to the 7th of November in Telangana
TG TET 2024 Application Process Postponed

అయితే అభ్యర్థులు ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని, ఈనెల 7 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చని విద్యాశాఖ తెలిపింది. కాగా ఈ ఏడాది టెట్‌ నోటిఫికేషన్‌ ఇవ్వడం ఇది రెండోసారి. జాబ్‌ క్యాలెండర్‌లో భాగంగా ఏడాదికి రెండుసార్లు టెట్‌ నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే.

AP DSC 2024 Postponed: డీఎస్సీ అభ్యర్థులకు షాక్‌.. నోటిఫికేషన్‌ వాయిదా

TS TET 2023 Notification Released: DSC Followers Stay Tuned!"

కాగా ఈ ఏడాది మే 20 నుంచి జూన్‌ 2 వరకూ టెట్‌ నిర్వహించారు. ఈ పరీక్షలకు 2.35 లక్షల మంది హాజరయ్యారు. తాజాగా మరోసారి టెట్‌ నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TG TET) 2025 జనవరి 1వ తేదీ నుంచి 20వ తేదీ వరకూ జరగనుంది.

TET 2025 Information Bulletin: టెట్‌ బులెటిన్‌ విడుదల రేపు.. దరఖాస్తు, పరీక్షల‌ తేదీలు ఇవే..

తాజా టెట్‌కు సంబంధించిన విధివిధానాలు, సిలబస్‌తో కూడిన సమాచార బులిటెన్‌ న‌వంబ‌ర్‌ 7న  https://schooledu.telangana.gov.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతున్నట్టు అధికారులు తెలిపారు.

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

 

Published date : 06 Nov 2024 01:12PM

Photo Stories