Skip to main content

Breaking News All Schools Holiday: స్కూల్స్‌, కాలేజీలు బంద్‌.. రెడ్‌ అలెర్ట్‌ జారీ

విద్యార్థులకు గుడ్‌న్యూస్‌. భారీ వర్షాల కారణంగా పాఠశాలలు, కళాశాలలను మూసివేయాలని అధికారులు ఆదేశించారు. దీంతో తమిళనాడులోని అన్ని విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది.ఫెంగల్ తుఫాను అక్కడి ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది.తుఫాన్‌ ప్రభావంతో పుదుచ్చేరి, చెన్నైతో సహా తమిళనాడులోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ అంచనా వేసింది.
Breaking News All Schools Holiday  Tamil Nadu government declares holidays for educational institutions
Breaking News All Schools Holiday Cyclone Fengal Landfall Today Schools, Colleges Shut In Tamil Nadu, Puducherry

భారీ వర్షాలు..

పుదుచ్చేరి, కడలూరు, విల్లుపురం, కళ్లకురిచ్చి, చెంగల్పట్టు, కాంచీపురం, చైన్నె, తిరువళ్లూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశాలున్నాయి. ఈ జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు. అనేక తీర ప్రాంతాలు ఇప్పటికే వాతావరణంలో మార్పు,  అధిక ఆటుపోట్లను చూస్తున్నాయని తెలిపింది. తీరాన్ని ఫెంగల్‌ సమీపించే కొద్దీ గాలిప్రభావం 90 కి.మీ వేగంతో ఉండేందుకు అవకాశాలు ఉండడంతో ముందు జాగ్రత్తలు విస్తృతమయ్యాయి.

Telangana Half-day Schools in March: Check Summer Holidays Dates | Sakshi  Education

Schools To Reopen: తిరిగి తెరుచుకోనున్న పాఠశాలలు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

విద్యాసంస్థలు బంద్‌

తుఫాను కారణంగా భారీ వర్షంతోపాటు బలమైన గాలులు వీస్తుండటంతో సాధారణ జనజీవనం స్తంభించింది. పుదుచ్చేరి, తమిళనాడులో పాఠశాలలు, కళాశాలలను మూసివేయాలని అధికారులు ఆదేశించారు. చెన్నై, కాంచీపురం, చెంగల్‌పట్టు, తిరువళ్లూరు, కడలూరు, విల్లుపురం, కళ్లకురిచ్చి, మైలాడుతురై జిల్లాల్లో పాఠశాలలు, కళాశాలలు మూతపడనున్నాయి. ఉద్యోగులను ఇంటి నుంచి పనిచేసేందుకు అనుమతించాలని కంపెనీలను కోరారు. 

బ్రేకింగ్ న్యూస్ 2024 |భారీ వర్షం కారణంగా రేపు అన్ని పాఠశాలలకు  సెలవుBreaking News Tomorrow All Schools Holiday Due to Heavy Rain 2024

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

Published date : 02 Dec 2024 08:53AM

Photo Stories