Schools To Reopen: తిరిగి తెరుచుకోనున్న పాఠశాలలు.. ప్రభుత్వం ఆదేశాలు
Sakshi Education
దేశ రాజధాని ఢిల్లీలో పాఠశాలలు తిరిగి తెరుచుకోనున్నాయి. గాలి నాణ్యత దారుణంగా పడిపోవడంతో గత కొన్నిరోజులుగా ప్రభుత్వం స్కూళ్లకు పాఠశాలలు ప్రకటించిన సంగతి తెలిసిందే. వాయుకాలుష్యం కారణంగా అక్టోబర్ 18 నుంచి ఆన్‌లైన్ మోడ్‌లోనే తరగతులు నిర్వహించేవారు. అయితే తాజాగా గాలి నాణ్యత కాస్త మెరుగైన నేపథ్యంలో పాఠశాలలు, కళాశాలల్లో తరగతులను పునఃప్రారంభించాలని సీఏక్యూఎం.. సుప్రీంకోర్టును కోరింది.
Schools To Reopen Delhi School Reopen News
ఈ నేపధ్యంలో సుప్రీంకోర్టు నుంచి గ్రీన్ సిగ్నల్ లభించడంతో ఢిల్లీ ఎన్‌సీఆర్‌లోని అన్ని పాఠశాలలు, కళాశాలలు పునఃప్రారంభం కానున్నాయి. మొన్నటివరకు హైబ్రిడ్ మోడ్‌లో అంటే అటు ఆన్‌లైన్‌లో, ఇటు ఆఫ్‌లైన్‌లోనూ పాఠశాలలను నిర్వహించేవారు.
అయితే ఇప్పుడు పూర్తిస్థాయిలో స్కూళ్లు తెరుచుకోనున్నాయి. విద్యార్థుల చేత మాస్క్‌లు ధరింపజేయాలని ప్రభుత్వం ఉపాధ్యాయులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో పాటు అవుట్ డోర్ గేమ్స్ విషయంలోనూ జాగ్రత్తలు పాటించాలని సూచించింది. పాఠశాలలకు వెళ్లే సమయంలో పిల్లలు కాలుష్యం బారిన పడకుండా ఉండేందుకు తల్లిదండ్రులు తగిన చర్యలు తీసుకోవాలని కోరింది.