Skip to main content

Delhi Air Pollution : పెరుగుతున్న‌ ఢిల్లీ వాయు కాలుష్యంతో తీవ్ర ఇబ్బందులు.. ఏక్యూఐ!

ఢిల్లీలోని విషవాయువు స్థానికుల ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపుతోంది.  ఈ నేపధ్యంలో ఢిల్లీవాసులు ఎయిర్ ప్యూరిఫైయర్లు, మాస్క్‌లను ఆశ్రయిస్తున్నారు.
Heavy air pollution at new delhi leads to increase of aqi  Delhi Air Quality Index AQI board showing 500

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో తలెత్తిన వాయు కాలుష్యం ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. ఢిల్లీలో గాలి నాణ్యత సూచీ(ఏక్యూఐ) గత ఏడు రోజులుగా ప్రమాదకర స్థాయిలో కొనసాగుతోంది. మంగళవారం ఉదయం ఆనంద్ విహార్‌తో సహా ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఏక్యూఐ 500కి చేరుకుంది.

Indian Startup: భార‌త్‌లో ప్రస్తుతం 1.53 లక్షలకు పైగా స్టార్టప్‌లు.. ఈ రాష్ట్రాల్లో..

ఢిల్లీలోని విషవాయువు స్థానికుల ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపుతోంది.  ఈ నేపధ్యంలో ఢిల్లీవాసులు ఎయిర్ ప్యూరిఫైయర్లు, మాస్క్‌లను ఆశ్రయిస్తున్నారు. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (సీపీసీబీ) తెలిపిన వివరాల ప్రకారం సోమవారం ఢిల్లీలోని ఏక్యూఐ ‘చాలా తీవ్రమైన’ కేటగిరీకి చేరుకుంది. ఏక్యూఐ 484గా నమోదైంది.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

కాలుష్యాన్ని తగ్గించడానికి గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లా(గ్రాప్‌)-4 కింద ఆంక్షలను తక్షణమే  విధించాలని జాతీయ రాజధాని ప్రాంతంలోని అన్ని రాష్ట్రాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరిన నేపధ్యంలో ఢిల్లీ ప్రభుత్వం 10, 12 తరగతులు మినహా మిగిలిన తరగతుల వారికి తరగతులను నిలిపివేయాలని నిర్ణయించింది.

Sakhi Depot: దేశంలోనే తొలి మహిళా బస్‌ డిపో ప్రారంభం.. ఎక్క‌డంటే..

వీరికి ఆన్‌లైన్‌లో తరగతులు నిర్వహించనున్నారు. ప్రమాదకరమైన విషపూరిత గాలి నుండి విద్యార్థులను  కాపాడేందుకే ఆన్‌లైన్ తరగతులను  నిర్వహించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. 10, 12వ తరగతి  బోర్డు పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల కోసం పాఠశాలలు  పనిచేయనున్నాయి. అయితే వీరికి కూడా ఆన్‌లైన్‌లో తరగతులు నిర్వహించనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 19 Nov 2024 02:57PM

Photo Stories