Startups: భారత్‌లో ప్రస్తుతం 1.53 లక్షలకు పైగా స్టార్టప్‌లు.. ఈ రాష్ట్రాల్లో..
Sakshi Education
భారతదేశంలో ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం గుర్తించిన స్టార్టప్‌లు 1.53 లక్షలకు పైగా ఉన్నాయి.
ఈ ఏడాది జులై నాటికి.. వ్యవసాయ, అనుబంధ రంగాల్లో ఆవిష్కరణలు, పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం కింద ఉన్న అగ్రి స్టార్టప్స్ 1708.
సేంద్రియ వ్యవసాయ, పశుసంవర్ధక, పాలు, వ్యవసాయ యాంత్రీకరణ.. ఇలాంటి అనేక విభాగాల్లో ఈ స్టార్టప్స్ ఉన్నాయి. అత్యధిక అగ్రి స్టార్టప్స్‌తో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉంది. ఆ తరవాతి స్థానాల్లో కర్ణాటక, తమిళనాడు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో 61 ఉన్నాయి.
రాష్ట్రాల వారీగా అగ్రి స్టార్టప్స్..
- మహారాష్ట్ర - 226
- కర్ణాటక - 211
- తమిళనాడు - 137
- తెలంగాణ - 98
- కేరళ - 97
- ఉత్తరప్రదేశ్ - 86
- హర్యాన - 84
- చత్తీస్‌ఘఢ్ - 79
- మధ్యప్రదేశ్ - 68
- రాజస్థాన్ - 66
Sakhi Depot: దేశంలోనే తొలి మహిళా బస్ డిపో ప్రారంభం.. ఎక్కడంటే..
Published date : 19 Nov 2024 01:43PM