Kisan Pehchan Patra ID: రైతులకు 'కిసాన్ పెహచాన్ పత్ర' ఐడీ
Sakshi Education
రైతుల వివరాలను డిజిటలైజ్ చేసే ప్రక్రియలో భాగంగా కేంద్ర వ్యవసాయ శాఖ సరికొత్త డేటాబేస్‌ను తయారుచేస్తోంది.

'కిసాన్ పెహచాన్ పత్ర' అని పిలిచే ఐడీని ప్రతి రైతుకూ ఇవ్వనుంది. రైతులకు ఉన్న భూమి, పండించిన పంటలు వంటి వివరాలు ఇందులో పొందుపరుస్తారు. ఇది కూడా ఒక రకంగా ఆధార్ లాంటిదే. రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఇప్పటివరకూ 11 రాష్ట్రాలకు చెందిన 3.5 కోట్లకుపైగా అన్నదాతల సమాచారాన్ని పొందుపరిచారు.
టాప్ 5 రాష్ట్రాలు ఇవే..
రాష్ట్రం | మంజూరు చేసిన డిజిటల్ ఐడీలు (లక్షల్లో) |
---|---|
ఉత్తరప్రదేశ్ | 120 |
మహారాష్ట్ర | 65 |
మధ్యప్రదేశ్ | 56 |
గుజరాత్ | 3.9 |
ఆంధ్రప్రదేశ్ | 2.9 |
Uniform Civil Code: దేశంలో తొలిసారి అమల్లోకి 'ఉమ్మడి పౌరస్మృతి చట్టం'
Published date : 04 Mar 2025 03:25PM