Forest Officer Bharani: ఎన్నో పర్వతాలను అధిరోహించిన భరణి

ప్రకృతి పాఠశాల అంటే భరణికి చిన్నప్పటి నుంచి ఇష్టం. ఆ ఇష్టమే ఆమెను ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్‌లోకి వచ్చేలా చేసింది. కొండలు, కోనలు భరణి నేస్తాలు. ఆ స్నేహమే ప్రపంచంలోని ప్రసిద్ధ పర్వతాలు అధిరోహించేలా చేస్తోంది.
స్ఫూర్తినిచ్చే సాహసికుల గురించి వినడం, చదవడం భరణికి ఎంతో ఇష్టమైన పని. అలా విన్నప్పుడు, చదివినప్పుడు తాను కూడా ఆ పర్వతాలను అధిరోహించినట్లు కల కనేవారు. ఆ కల నిజమయ్యే సమయం రానే వచ్చింది. ఐపీఎస్ అధికారి అతుల్ కరవాల్ 50 ఏళ్ల వయసులో ఎవరెస్టు అధిరోహించడం భరణిని ప్రభావితం చేసింది. అతుల్ కరవాల్ ఎవరెస్ట్ అధిరోహించినట్లే తానూ ప్రపంచంలో మేటి శిఖరాలను అధిరోహించాలనుకున్నారు. భరణి 30 రోజులపాటు శిక్షణ తీసుకున్నారు.
శిక్షణ తరువాత.. ఎన్నో శిఖరాలు
రంపచోడవరంలో ఉప అటవీశాఖ అధికారిణిగా పనిచేస్తూనే డార్జిలింగ్‌లో కేంద్ర రక్షణ శాఖ నిర్వహిస్తోన్న హిమాలయన్ మౌంటెనరీ ఇన్ స్టిట్యూట్‌లో కోర్సు పూర్తి చేశారు. తొలి ప్రయత్నంగా లద్దాఖ్‌లోని కాంగ్ యాప్సే పర్వతాన్ని అధిరోహించారు.
Sarojini Naidu: మహాత్మునితో ‘మిక్కీ మౌస్’ అని పిలిపించుకున్న సరోజినీ నాయుడు.. ఆమె చరిత్ర ఇదే..
- కాంగ్ యాప్సే పర్వతం (లద్ఖాఖ్) – మొదటి విజయంగా ఈ పర్వతాన్ని అధిరోహించిన భరణి, తనపై ఉన్న నమ్మకాన్ని మరింత పెంచుకుంది.
- మల్లార్ లేక్ శిఖరం (ఉత్తరాఖండ్) – 4,200 మీటర్ల ఎత్తు.
- ఎల్ బ్రస్ పర్వతం (రష్యా) – 5,642 మీటర్ల ఎత్తు.
- కిలిమంజారో పర్వతం (ఆఫ్రికా) – 5,895 మీటర్ల ఎత్తు. ఈ పర్వతాన్ని అధిరోహించడం భరణి జీవితం లోనే ఒక పెద్ద సాహసంగా నిలిచింది. 28 కిలోల బరువును మోస్తూ 26 గంటల సుదీర్ఘ ప్రయాణంలో ఈ శిఖరాన్ని అధిరోహించింది.
ప్రకృతి పాఠశాలలో..
తమిళనాడులోని కోయంబత్తూరు భరణి జన్మస్థలం. తండ్రి సాథూర్ స్వామి ఆర్మీ ఆఫీసర్. తల్లి పద్మ టీచర్. నాన్న ఉద్యోగరీత్యా రాష్ట్రంలోని పలుప్రాంతాల్లో ఆమె చదువు కొనసాగింది. తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయంలో బీఎస్సీ పూర్తి చేసింది. తొమ్మిదో తరగతిలో కొడైకెనాల్‌కు విహారానికి వెళ్లినప్పుడు ఆ దట్టమైన అటవీప్రాంతం, సరస్సులు, కొండల నడుమ జాలువారే జలపాతాలు భరణి మనసును కట్టిపడేశాయి. పర్వత్రపాంతాలకు వెళ్లేటప్పుడు పర్వతారోహణకి సంబంధించి మెలకువలు నేర్చుకున్నారు. భవిష్యత్‌లో మరిన్ని శిఖరాలను అధిరోహించాలనేది భరణి కల. ఆమె కల నెరవేరాలని ఆశిద్దాం.
Miss Telugu USA: ‘మిస్ తెలుగు యూఎస్‌ఏ–2025’ పోటీలో ఫైనల్‌కు చేరిన తెలంగాణ అమ్మాయి..!
ప్రతి సాహసం ఒక పాఠమే
"ప్రతి ప్రయాణం, ప్రతి సాహసం ఎన్నో పాఠాలు నేర్పుతుంది. అలా ఎప్పటికప్పుడు కొత్త కొత్త పాఠాలు నేర్చుకుంటున్నాను. ‘హాయిగా ఉద్యోగం చేసుకోకుండా ఎందుకు ఈ రిస్క్?’ అనే వాళ్లు కూడా ఉంటారు. అయితే రిస్క్ లేనిది ఎక్కడా! సాహసం చేస్తేనే దానిలో ఉన్న మజా ఏమిటో తెలుస్తుంది. ఒక సాహసం మరొక సాహసానికి స్ఫూర్తినిస్తుంది. పర్వతారోహణ అనేది మనలోని ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసే సాహసం. భవిష్యత్‌లో మరిన్ని ప్రసిద్ధ పర్వతాలను అధిరోహించాలనుకుంటున్నాను." అని భరణి అన్నారు.
☛ Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Tags
- IFS officer Bharani
- Divisional Forest Officer
- IPS Officer Atul Karawal
- Himalayan Mountaineering Institute
- Ministry of Defence
- Kang Yatse Hill
- IFS officer Bharani Biography
- IFS officer Bharani History
- Mallard Lake Peak
- mount elbrus
- Mount Kilimanjaro
- Sakshi Education News
- Success Story
- IFS officer Success Story