Skip to main content

ICC Champions Trophy 2025: ఛాంపియ‌న్స్ ట్రోఫీ విజేతగా భార‌త్.. ప్రైజ్‌ మనీ ఎంతంటే..?

ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ–2025ను భారత్‌ సొంతం చేసుకుంది.
ICC Champions Trophy 2025: India win third title with four-wicket victory over New Zealand

మార్చి 9వ తేదీ దుబాయ్‌లో  జరిగిన ఫైనల్లో భారత్‌ 4 వికెట్ల తేడాతో మాజీ చాంపియన్‌ న్యూజిలాండ్‌పై విజయం సాధించింది. గతంలో భారత్‌ 2002, 2013లలో కూడా చాంపియన్స్‌ ట్రోఫీ టైటిల్‌ను గెల్చుకుంది. 

లీగ్‌ దశలో మూడు మ్యాచ్‌లతో పాటు సెమీఫైనల్, ఫైనల్‌ కలిపి ఆడిన ఐదు మ్యాచ్‌లలో ఓటమి లేకుండా జట్టు టైటిల్‌ గెలుచుకుంది. 

ఫైనల్లో టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కివీస్‌ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. డరైల్‌ మిచెల్‌ (101 బంతుల్లో 63; 3 ఫోర్లు), మైకేల్‌ బ్రేస్‌వెల్‌ (40 బంతుల్లో 53 నాటౌట్‌; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు చేశారు. అనంతరం భారత్‌ 49 ఓవర్లలో 6 వికెట్లకు 254 పరుగులు సాధించి గెలిచింది. 

‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ రోహిత్‌ శర్మ (83 బంతుల్లో 76; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు) చెలరేగగా.. శ్రేయస్‌ అయ్యర్‌ (62 బంతుల్లో 48; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. టోర్నీ మొత్తంలో 263 పరుగులు చేసి 3 వికెట్లు తీసిన న్యూజిలాండ్‌ ప్లేయర్‌ రచిన్‌ రవీంద్ర ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద టోర్నీ’ అవార్డు గెల్చుకున్నాడు.  

ICC Awards: నాలుగు ఐసీసీ అవార్డులు అందుకున్న బుమ్రా..!
 
ప్రైజ్ మనీ ఎంతంటే?
ఛాంపియ‌న్స్ ట్రోఫీ విన్న‌ర్‌గా నిలిచిన టీమిండియాకు 22 లక్షల 40 వేల డాలర్లు (రూ.19 కోట్ల 52 లక్షలు) అందుకుంది. అదే విధంగా రన్నరప్‌గా నిలిచిన కివీస్‌కు 11 లక్షల 20 వేల డాలర్లు (రూ.9 కోట్ల 76 లక్షలు) ప్రైజ్‌మ‌నీ ద‌క్కింది. సెమీఫైన‌ల్‌లో ఓటిమిపాలైన ద‌క్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జ‌ట్ల‌కు 560,000 డాల‌ర్లు (రూ.4.86 కోట్లు) ల‌భించాయి. 

ఐదో, ఆరో స్ధానాల్లో నిలిచిన జ‌ట్లు 350,000 డాల‌ర్లు (రూ.3 కోట్లు పైగా).. ఏడవ, ఎనిమిదవ స్థానంలో ఉన్న జట్లు 140,000 డాల‌ర్లు (రూ.సుమారు 1.2 కోట్లు) ద‌క్కించుకున్నాయి. గ్రూపు స్టేజిలో విజ‌యం సాధించిన జ‌ట్టుకు 34,000 డాల‌ర్లు (సుమారు రూ.33 లక్షలు) అంద‌నుంది. ఈ మెగా టోర్నీలో పాల్గోన్నంద‌కు ప్ర‌తీ జ‌ట్టుకు 125,000 డాల‌ర్లు(రూ.కోటి) ఐసీసీ అంద‌జేయ‌నుంది. అంటే ఈ మెత్తాన భార‌త్‌కు రూ.21 కోట్ల‌పైనే అందింది.

  • భారత్ సాధించిన అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టైటిల్స్ సంఖ్య 7. ఇందులో 2 వన్డే వరల్డ్ క‌ప్‌లు (1983, 2011). 2 టీ20 వరల్డ్ క‌ప్‌లు(2007. 2024), 3 చాంపియ‌న్స్ ట్రోఫీలు (2022, 2013, 2025) ఉన్నాయి. ఈ జాబితాలో ఆస్ట్రేలియా 10 ఐసీసీ టైటిల్స్‌తో అగ్రస్థానంలో ఉంది.

Virat Kohli: ప్రపంచ రికార్డు సృష్టించిన విరాట్‌ కోహ్లి

Published date : 10 Mar 2025 12:55PM

Photo Stories