Studying In America: అమెరికాలో భారత విద్యార్థులే టాప్.. ఆ కోర్సుల్లో ఎక్కువగా అడ్మిషన్స్
డ్రాగన్‌ను దాటేశాం..!
అమెరికా వర్సిటీలు, కళాశాలల్లో అంతర్జాతీయ విద్యార్థుల చేరికల్లో చైనాను భారత్ అధిగవిుంచింది. చైనా విద్యార్థుల సంఖ్య 2022–23లో 27.4 శాతం ఉండగా 2023–24లో 24.6 శాతానికి పడిపోయింది. 15 ఏళ్లలో ఇదే తక్కువ. గత విద్యా సంవత్సరం అమెరికాలో 11.26 లక్షల మంది అంతర్జాతీయ విద్య అభ్యసిస్తున్నట్టు నివేదిక తెలిపింది. ఇది ఆల్‌టైమ్ రికార్డుగా పేర్కొంది.
ఇందులో అగ్రస్థానంలో భారతీయ విద్యార్థులు (3.31 లక్షలు) ఉండగా 2.77 లక్షలతో చైనా విద్యార్థులు, 43,149 మందితో సౌత్ కొరియా విద్యార్థులు తరువాత స్థానాల్లో నిలిచారు. 64.5 శాతం మంది భారతీయ విద్యార్థులు అమెరికాలో పబ్లిక్ వర్సిటీలను ఎంచుకుంటున్నారు. 35.5 శాతం మంది స్పెషలైజ్డ్ ప్రోగ్రామ్స్, పరిశోధనల కోసం ప్రైవేట్ వర్సిటీలకు వెళ్తున్నారు.
Campus Placements: రూ.9 లక్షల ప్యాకేజీతో విద్యార్థులకు ప్లేస్‌మెంట్స్.. ఎస్‌ఆర్‌ఐటీ విద్యార్థుల ప్రతిభ
ఈ ఏడాది 3 శాతం పెరుగుదల..
ప్రస్తుత విద్యా సంవత్సరంలో అమెరికాలో అంతర్జాతీయ విద్యార్థుల చేరికలు మూడు శాతం పెరిగినట్లు స్నాప్‌చాట్ నివేదిక చెబుతోంది. యూఎస్‌లోని చాలా విద్యా సంస్థలు గ్రాడ్యుయేట్ విద్యలో ప్రవేశాలను పెంచుకునేందుకు భారత్, చైనా, ఘనా, నైజీరియాలపై దృష్టి పెట్టినట్టు తెలిపింది.
2022–23లో అమెరికాకు చెందిన 2.80 లక్షల మంది విద్యార్థులు ఇతర దేశాల్లో విద్యనభ్యసించారు. ఇటలీ, యూకే, స్పెయిన్, ఫ్రాన్స్ వారి ప్రధాన గమ్యస్థానాలుగా (45 శాతం) ఉన్నాయి. ఆ తర్వాత ఆస్ట్ర్రేలియా, న్యూజిలాండ్ (25 శాతం)లో ఎక్కువగా చేరికలున్నాయి.
స్టెమ్ కోర్సులపై దృష్టి..
భారతీయ విద్యార్థులకు అమెరికాలో అత్యంత ప్రాధాన్య విద్యా గమ్యస్థానాలుగా కాలిఫోరి్నయా, న్యూయార్క్, టెక్సాస్, మసాచుసెట్స్, ఇల్లినాయిస్ నిలిచాయి. అంతర్జాతీయ విద్యార్థులలో 56 శాతం మంది స్టెమ్ కోర్సులను అభ్యసించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్‌లో ఎక్కువగా ప్రవేశాలు పొందుతున్నారు. బిజినెస్ మేనేజ్‌మెంట్ ప్రవేశాల్లో 2 శాతం, ఫైన్, అప్లైడ్ ఆర్ట్స్‌లో 5 శాతం పెరుగుదల నమోదైంది.
Indian Students: ట్రంప్ ప్రమాణ స్వీకారానికి ముందే అమెరికాకు తిరిగి వచ్చేయండి.. భారతీయ విద్యార్థులకు వర్సిటీల సూచన
గ్లోబల్ డెస్టినేషన్..
2014 నుంచి అంతర్జాతీయ విద్యార్థుల గ్లోబల్ డెస్టినేషన్‌గా అమెరికా కొనసాగుతోంది. కెనడా, యూకే తరువాత వరుసలో ఉన్నాయి. యూకేలో మొత్తం విద్యార్థుల్లో అంతర్జాతీయ విద్యార్థులు 27 శాతం, కెనడాలో 38 శాతం, ఆస్ట్రేలియాలో 31 శాతం ఉన్నారు. మరోవైపు భారత్‌ను అధ్యయన కేంద్రంగా ఎంచుకున్న అమెరికా విద్యార్థుల్లో 300 శాతం పెరుగుదల కనిపించింది. 2022–23లో భారత్‌లో చదువుతున్న అమెరికన్ల సంఖ్య 300 నుంచి 1,300కి పెరిగింది.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Tags
- Studying In America
- international students
- International student enrollment
- international student enrolments
- Study in USA
- american colleges
- Academic year
- US colleges and universities
- States Bureau of Educational and Cultural Affairs
- STEM Courses
- STEM Courses in USA
- United States
- United States of America
- global education
- Global education standards
- Undergraduate Programmes
- Post Graduate Programmes
- maximum number of students to the US