Skip to main content

Delhi Schools : హైబ్రిడ్ మోడ్‌లో ఢిల్లీ పాఠ‌శాల‌లు.. ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం!

Delhi schools to run in hybrid mode

న్యూఢిల్లీ: రాజధాని ఢిల్లీలో పాఠశాలల నిర్వహణలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ, ప్రైవేట్ మునిసిపల్ ఆధ్వర్యంలో నడిచే పాఠశాలలను ‘హైబ్రిడ్ మోడ్‌’లో అంటే ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లలో నడపాలని ఆదేశించింది. నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్‌సీఆర్‌)లో గాలి నాణ్యతలో కాస్త మెరుగుదల ఏర్పడిన దరిమిలా కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ (సీఏక్యూఎం) సడలింపులను ప్రకటించిన తర్వాత ప్రభుత్వం పాఠశాలల నిర్వహణలో ఈ నిర్ణయం తీసుకుంది.

STEM Programs : స్టెమ్‌ ప్రోగ్రామ్స్‌తో విస్తృత అవకాశాలు.. అంతర్జాతీయంగా స్టెమ్‌ నిపుణులకు డిమాండ్‌!

ఢిల్లీ ఎన్‌సీఆర్‌లోని అన్ని పాఠశాలలను అక్టోబర్ 18 నుండి ఆన్‌లైన్‌ మోడ్‌లో నిర్వహిస్తున్నారు. అయితే తాజాగా గాలి నాణ్యత చాలా తక్కువ వర్గానికి చేరుకుంది. ఈ నేపధ్యంలో పాఠశాలలు, కళాశాలల్లో తరగతులను పునఃప్రారంభించాలని సీఏక్యూఎం సుప్రీంకోర్టును కోరింది. ఈ నేపధ్యంలో సుప్రీంకోర్టు నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ లభించడంతో ఢిల్లీ ఎన్‌సీఆర్‌లోని అన్ని పాఠశాలలు, కళాశాలల్లో హైబ్రిడ్ మోడ్‌లో విద్యాబోధన కొసాగనుంది. దీని ప్రకారం పాఠశాల తరగతులను అటు ఆన్‌లైన్‌లో, ఇటు అఫ్‌లైన్‌లోనూ నిర్వహించనున్నారు. ఆయా ప్రాంతాల్లోని పరిస్థితులకు అనుగుణంగా ఆన్‌లైన్‌ లేదా ఆఫ్‌లైన్‌లో తరగతులు నిర్వహిస్తారు.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 26 Nov 2024 02:50PM

Photo Stories