Skip to main content

Schools and Banks holidays in March Month: మార్చి నెలలో స్కూళ్లకు, బ్యాంకులకు సెలవులు ఇవే..

School and bank holiday schedule for March 202   List of school and bank holidays in March 2025 Schools and Banks holidays in March Month   March 2025 school and bank holidays announcement
Schools and Banks holidays in March Month


తెలుగు రాష్ట్రాల్లో (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ) స్కూళ్లు, బ్యాంక్ సెలవుల వివరాలను ముందుగా తెలుసుకోవడం చాలా అవసరం. మార్చి నెలలో హోలీ, ఉగాది, రంజాన్ వంటి పండుగలు ఉన్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో స్కూళ్లకు బ్యాంకులకు సెలవులు ఇవే..
మార్చి 8న రెండో శనివారం, మార్చి 14న హోలీ, మార్చి 22న నాలుగో శనివారం, మార్చి 30న ఉగాది, మార్చి 31న రంజాన్ (ఈద్ ఉల్ ఫితుర్) నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్) స్కూళ్లకు బ్యాంకులకు హాలిడే ఉంది. ఇంకా వీటికి తోడు మార్చి 2,9,16,23 ఆదివారాలు కావడంతో స్కూళ్లు, బ్యాంకులు మూసివేసి ఉంటాయి. ఇలా మొత్తంగా మార్చి నెలలో తెలుగు రాష్ట్రాల్లో 9 రోజులు స్కూళ్లు, బ్యాంకులు  మూసివేసి ఉంటాయి. బ్యాంకులు మూసివేసి ఉన్నప్పటికీ.. మొబైల్ బ్యాంకింగ్, ఆన్‌లైన్ బ్యాంకింగ్ వంటి సేవలు వినియోగించుకోవచ్చు. ఏటీఎం, క్యాష్ డిపాజిట్ మెషీన్లు కూడా పనిచేస్తాయి.

బ్యాంక్ హాలిడేలను తెలుసుకోవడం ఎందుకు అవసరం?
వేర్వేరు ఆర్థిక అవసరాల నిమిత్తం మనం తరచుగా బ్యాంకులను సందర్శిస్తూ ఉంటాం.

ముఖ్యంగా:

  • డబ్బులు జమ చేయడం & విత్‌డ్రా చేయడం
  • పాస్‌బుక్, ఏటీఎం, చెక్‌బుక్ సేవలు పొందడం
  • లోన్లు తీసుకోవడం & ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేయడం
  • ప్రభుత్వ పథకాల్లో డిపాజిట్లు నిర్వహించడం
  • ఇలాంటి లావాదేవీల కోసం బ్యాంకులకు వెళ్లే వారు, బ్యాంకులు ఎప్పుడు తెరిచి ఉంటాయో, ఎప్పుడు మూసి ఉంటాయో తప్పనిసరిగా తెలుసుకోవాలి.


బ్యాంక్ సెలవులు – ప్రతి చోటా ఒకేలా ఉండవా?
అన్ని ప్రాంతాల్లో బ్యాంక్ సెలవులు ఒకేలా ఉండవు. జాతీయ సెలవులు దేశవ్యాప్తంగా ఒకేలా ఉంటాయి. కానీ ప్రాంతీయ సెలవులు ప్రత్యేకంగా రాష్ట్రాల పరిస్థితులను బట్టి మారుతుంటాయి.

మార్చిలో దేశవ్యాప్తంగా బ్యాంక్ సెలవులు ఇలా..

తేది వారం సెలవు కారణం రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలు
మార్చి 7 (శుక్రవారం) 'చాప్‌చార్ కుట్' పండుగ మిజోరం
మార్చి 13 (గురువారం) హోలిక దహన్, అట్టుకల్ పొంగళ పండుగ జార్ఖండ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, కేరళ
మార్చి 14 (శుక్రవారం) హోలీ త్రిపుర, కర్ణాటక, ఒడిశా, తమిళనాడు, మణిపూర్, కేరళ, నాగాలాండ్ మినహా ఇతర రాష్ట్రాలు
మార్చి 15 (శనివారం) హోలీ త్రిపుర, కర్ణాటక, ఒడిశా, తమిళనాడు, మణిపూర్
మార్చి 22 (శనివారం) 'బీహార్ దివస్' (రాష్ట్ర అవతరణ దినోత్సవం) బీహార్
మార్చి 27 (గురువారం) షబ్-ఎ-ఖదర్ జమ్మూ & కాశ్మీర్
మార్చి 28 (శుక్రవారం) జుమాత్-ఉల్-విదా (రంజాన్ చివరి శుక్రవారం) జమ్మూ & కాశ్మీర్
మార్చి 31 (సోమవారం) ఈద్ మిజోరం, హిమాచల్ ప్రదేశ్ మినహా అన్ని రాష్ట్రాలు
 
Published date : 27 Feb 2025 06:18PM

Photo Stories