Skip to main content

Delhi Air Pollution: ఢిల్లీలో పెరుగుతూ, తగ్గుతూ వస్తోన్న వాయు కాలుష్యం!

దేశరాజధాని ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో కాలుష్య స్థాయి ఒకరోజు పెరుగుతూ, మరోరోజు తగ్గుతూ వస్తోంది.
Delhi Air Quality Deteriorates, AQI In Very Poor Category

న‌వంబ‌ర్ 28వ తేదీ (గురువారం) ఉదయం మరోసారి ఢిల్లీలో కాలుష్య స్థాయి 300కి చేద‌ని పలు ప్రాంతాల్లో గాలి నాణ్యత చాలా తక్కువ కేటగిరీలో ఉంది. ఇండియా గేట్ వద్ద భారీగా పొగమంచు కమ్ముకుంది. కాళింది కుంజ్‌లోని యమునా నదిలో విషపు నురుగు తేలియాడుతోంది.

వాయు కాలుష్యం కారణంగా కంటి నొప్పులు, గొంతు సమస్యలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని పలువురు బాధితులు చెబుతున్నారు. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో కురుస్తున్న పొగమంచు.. ప్రజలపై సూర్యుని వేడి పడకుండా చేస్తోంది. ఫలితంగా శరీరంలోని ఎముకలు బలహీనంగా మారుతున్నాయి. ఎయిమ్స్‌ అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. 

New Fish Species: మూడు కొత్త ర‌కం చేపలను క‌నుగొన్న శాస్త్రవేత్తలు.. ఇవి క‌నిపించేది ఈ రాష్ట్రాల్లోనే..

సూర్యకాంతి నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాలు శరీరంలో 90 శాతం విటమిన్ డి3 ఉత్పత్తికి మూలకారణంగా నిలుస్తున్నాయి. భారీగా కురుస్తున్న పొగమంచు శీతాకాలంలో సూర్యరశ్మి నేరుగా భూమిని చేరుకోకుండా అడ్డుకుంటోంది.

ఎయిమ్స్‌ నిపుణులు ఢిల్లీ, గురుగ్రామ్‌లలో పలువురిపై నిర్వహించిన అధ్యయనంలో పలు విషయాలు వెల్లడయ్యాయి. ఢిల్లీలో పొగమంచు కారణంగా ప్రజలపై సూర్యరశ్మి తక్కువగా పడిందని, దీంతో చాలామంది విటమిన్ డి లోపానికి గురైనట్లు అధ్యయనంలో తేలింది. 

ఢిల్లీలో అంతకంతకూ కాలుష్య స్థాయి పెరుగుతోంది. పొగమంచు సమస్య తీవ్రతరమయ్యింది. ఈరోజు రాజధానిలో దట్టమైన పొగమంచు కురిసే అవకాశాలున్నాయని చెబుతూ వాతావారణశాఖ ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది.

Delhi Air Pollution : పెరుగుతున్న‌ ఢిల్లీ వాయు కాలుష్యంతో తీవ్ర ఇబ్బందులు.. ఏక్యూఐ!

Published date : 28 Nov 2024 05:54PM

Photo Stories