Skip to main content

TET 2025 Information Bulletin: టెట్‌ బులెటిన్‌ విడుదల రేపు.. దరఖాస్తు, పరీక్షల‌ తేదీలు ఇవే..

సాక్షి, హైదరాబాద్‌: ఉపాధ్యాయ అర్హత పరీక్షకు సంబంధించిన ఇన్ఫర్మేషన్‌ బులెటిన్‌ను న‌వంబ‌ర్‌ 7వ తేదీన విడుదల చేయనున్నట్టు పాఠశాల విద్య డైరెక్టరేట్‌ ఒక ప్రకటనలో తెలిపింది. వాస్తవానికి ఈ బులెటిన్‌ను న‌వంబ‌ర్‌ 5న విడుదల చేయాల్సి ఉంది. సాంకేతిక కారణాల వల్ల సాధ్యం కాలేదని పేర్కొంది.
Tet Information Bulletin will be released tomorrow news in telugu  Teacher Eligibility Test information bulletin release delayed to November 7

ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TG TET) 2025 జనవరి 1వ తేదీ నుంచి 20వ తేదీ వరకూ జరగనుంది. తెలంగాణ‌ పాఠశాల విద్య డైరెక్టర్‌ ఈవీ నర్సింహారెడ్డి న‌వంబ‌ర్‌ 4న ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. న‌వంబ‌ర్‌ 5 నుంచి 20వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఏడాది టెట్‌ నోటిఫికేషన్‌ ఇవ్వడం ఇది రెండోసారి.

జాబ్‌ క్యాలెండర్‌లో ఏడాదికి రెండుసార్లు టెట్‌ నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా ఈ ఏడాది మే 20 నుంచి జూన్‌ 2 వరకూ టెట్‌ నిర్వహించారు. ఈ పరీక్షలకు 2.35 లక్షల మంది హాజరయ్యారు.

చదవండి: టెట్‌ - డీఎస్సీ | సిలబస్ | బిట్ బ్యాంక్ | ప్రిపరేషన్ గైడెన్స్ | మోడల్ పేపర్స్ | AP TET ప్రివియస్‌ పేపర్స్ | TS TET ప్రివియస్‌ పేపర్స్

వీరిలో 1.09 లక్షల మంది అర్హత సాధించారు. ఉపాధ్యాయ పోస్టుల భర్తీ నేపథ్యంలోనూ బీఈడీ, డీఈడీ పూర్తి చేసిన వారికి టెట్‌ రాసే అవకాశం కల్పించారు.

తాజా టెట్‌కు సంబంధించిన విధివిధానాలు, సిలబస్‌తో కూడిన సమాచార బులిటెన్‌ న‌వంబ‌ర్‌ 5న  https://schooledu.telangana.gov.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతున్నట్టు అధికారులు తెలిపారు. అయితే ఇటీవలే 11,062 టీచర్‌ పోస్టులు భర్తీ చేయడం, టెట్‌ నిర్వహించడంతో.. జనవరిలో నిర్వహించే టెట్‌కు ఎక్కువ మంది దరఖాస్తు చేసుకోకపోవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. టెట్‌లో ఒకసారి అర్హత సాధిస్తే జీవితకాలం పాటు చెల్లుబాటు అవుతుంది. 

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here
Published date : 06 Nov 2024 11:32AM

Photo Stories