Skip to main content

TET Paper 2 2024 Notification : ఉపాధ్యాయ ఉద్యోగాల‌కు టెట్‌-2024 నోటిఫికేష‌న్ విడుద‌ల‌.. ప‌రీక్ష‌ల తేదీలు ఇవే

తెలంగాణ రాష్ట్ర విద్యా శాఖ తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌) 2024–ఐఐ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ప్రభుత్వ ఉపాధ్యాయులుగా నియమితులు కావాలంటే టెట్‌లో అర్హత సాధించడం తప్పనిసరి. టెట్‌ను జిల్లా కేంద్రాల్లో ఆన్‌లైన్‌లో కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌గా నిర్వహిస్తారు.
Teachers eligibility test 2024 paper 2 notification for govt teaching posts

»    అర్హత:  టెట్‌లో అర్హత సాధించిన అభ్యర్థులే టీఆర్‌టీ రాయడానికి అర్హులు. టెట్‌ పేపర్‌–1కి ఇంటర్, డీఈడీ అర్హత ఉండాలి. టెట్‌ పేపర్‌–2కి డిగ్రీ, బీఈడీ ఉత్తీర్ణులవ్వాలి. 
»    పరీక్ష విధానం: టెట్‌లో రెండు పేపర్లు ఉంటాయి. ప్రాథమిక పాఠశాలల్లోని సెకండరీ గ్రేడ్‌ టీచర్‌(ఎస్‌జీటీ) ఉద్యోగాలకు అర్హత పొందేందుకు  పేపర్‌–1, ఉన్నత పాఠశాలల్లోని స్కూల్‌ అసిస్టెంట్‌(ఎస్‌ఏ) ఉద్యోగాలకు పేపర్‌–2 పరీక్ష నిర్వహిస్తారు. పేపర్‌–2లో మళ్లీ గణితం, సైన్స్, సాంఘికశాస్త్రం రెండు వేర్వేరు పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపర్‌కు 150 మార్కులు. జనరల్‌ కేటగిరీలో 90, బీసీలు–75, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 60 మార్కులు సాధిస్తే అర్హత పొందవచ్చు. వారే టీఆర్‌టీ రాసేందుకు అర్హులవుతారు. టెట్‌ మార్కులకు 20 శాతం, టీఆర్‌టీలో వచ్చిన మార్కులకు 80 శాతం వెయిటేజి ఇచ్చి అభ్యర్థులకు తుది ర్యాంకు నిర్ణయిస్తారు. 

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

»    పరీక్ష విధానం: ఆన్‌లైన్‌లో కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష జరుగుతుంది.
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.
»    ఆన్‌లైన్‌ దర ఖాస్తులకు చివరితేది: 20.11.2024

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

»    పరీక్ష తేదీలు: 01.01.2025 నుంచి 20.01.2025 వరకు జరుగుతాయి.
»    పరీక్ష ఫలితాల తేది: 05.02.2025
»    వెబ్‌సైట్‌: https://tgtet2024.aptonline.in

 Non Teaching Jobs: ఇంటర్‌, డిగ్రీ అర్హతతో ప్రభుత్వ యూనివర్సిటీలో నాన్‌ టీచింగ్‌ ఉద్యోగాలు జీతం 78800

Published date : 11 Nov 2024 10:43AM

Photo Stories