Skip to main content

AP TET 2024 Key and Results 2024 : ఏపీ టెట్‌-2024 'కీ' విడుద‌ల.. రిజ‌ల్డ్స్ తేదీ ఇదే...!

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో టెట్-2024 ప‌రీక్ష‌ల ఫైన‌ల్ కీ ని విడుద‌ల చేశారు.
AP TET Key and Results and AP DSC 2024 Notification 2024   TET-2024 final key release in Andhra Pradesh  Final answer key of TET-2024 released on October 29  TET-2024 final key released by Sakshi Education  Andhra Pradesh TET-2024 final key released

షెడ్యూల్ ప్ర‌కారం అయితే టెట్‌-2024 ఫైన‌ల్‌ కీ ని అక్టోబ‌ర్ 27వ తేదీన విడుద‌ల చేయాల్సింది. కొన్ని అనివార్య కార‌ణాల వ‌ల్ల‌ టెట్‌-2024 ఫైన‌ల్ కీ విడుద‌ల అక్టోబ‌ర్ 29 తేదీన విడుద‌ల చేశారు.

☛➤ AP TET 2024 Final Key కోసం క్లిక్ చేయండి

☛➤ APPSC Jobs Notification Details 2024 : ఏపీపీఎస్సీ విడుద‌ల చేయ‌నున్న ఉద్యోగ నోటిఫికేష‌న్లు ఇవే...? ఇంకా ఫెండింగ్‌లో ఉన్న‌వి కూడా...

టెట్ ఫ‌లితాల విడుద‌ల‌పై కూడా.. ఆందోళ‌న‌..?
టెట్-2024 ఫ‌లితాల‌ను కూడా షెడ్యూల్‌ ప్రకారం అయితే నవంబర్‌ 2వ తేదీన విడుద‌ల చేయాల్సింది ఉంది. అయితే దీనిపైన కూడా విద్యాశాఖ అధికారులు ఎటువంటి క్లారీటీ ఇవ్వ‌లేదు. దీంతో డీఎస్సీ-2024కి సన్నద్ధమవుతున్న అభ్యర్థులు ఆందోళన వ్య‌క్తం చేస్తున్నారు. ఈ సారి టెట్‌కు మొత్తం 4,27,300 మంది దరఖాస్తు చేయగా.. 3,68,661 (86.28%) మంది హాజరయ్యారు.

➤☛ Inspirational Success Story : టెన్త్ ఫెయిల్ అయ్యాక‌... లారీ మెకానిక్‌గా చేశా...పాలు, పేప‌ర్‌ వేశాను... ఈ క‌సితోనే చ‌దివి... గ‌వ‌ర్న‌మెంట్ జాబ్ కొట్టానిలా...

డీఎస్సీ నోటిఫికేష‌న్ విడుద‌ల ఎప్పుడంటే...?
ఈ టెట్ 2024 ఫలితాలు విడుదలైన మరుసరటి రోజే మెగా డిఎస్సీ-2024 నోటిఫికేషన్ విడుదల చేసే అవ‌కాశం ఉంది. ఈ టెట్ 2024 ఫలితాలు విడుదలైన మరుసరటి రోజే అన‌గా న‌వంబ‌ర్ 3వ తేదీన‌ మెగా డీఎస్సీ-2024 నోటిఫికేషన్ విడుదల చేసే అవ‌కాశం ఉంది.

ఈ సారి డీఎస్సీ-2024 ద్వారా 16347 ప్ర‌భుత్వ టీచ‌ర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.  డిసెంబర్ 31 నాటికి ఎట్టి పరిస్థితుల్లో పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తి చేయాల‌నే ఆలోచ‌న‌లో ప్రభుత్వం ఉంది. అదే విధంగా డీఎస్సీ సిలబస్ పై కూడా ప్ర‌భుత్వం స్పష్టత ఇచ్చింది. డీఎస్సీ సిలబస్‌లో ఎలాంటి మార్పు లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. యధావిధిగా పాత సిలబస్‌ను కొనసాగించడానికి నిర్ణయించింది.

Published date : 30 Oct 2024 10:41AM

Photo Stories