Skip to main content

Again DSC 2024 Notification : మ‌రో డీఎస్సీ నోటిఫికేషన్‌పై క్లారిటీ.. కొత్త‌ సిలబస్ ఇదే...?

సాక్షి ఎడ్యుకేష‌న్ : అధికారంలోకి వస్తే.. డీఎస్సీ నోటిఫికేషన్ ఫైల్ పై తొలి సంతకం చేస్తానని ప్ర‌స్తుత ఏపీ సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఫైల్ పై తొలి సంతకం చేశారు. గ‌త ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిన 6000 పోస్టులతో పాటు.. దానికి మరో 10 వేల పోస్టులను కలిపి మొత్తం 16 వేలకు పైగా ఉపాధ్యాయ నియామక ప్రక్రియకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
AP DSC 2024 Notification  AP CM Chandrababu signs DSC notification file   AP government announces additional 10,000 teaching posts

అయితే నోటిఫికేషన్ ఇంతవరకు జారీ కాలేదు. ఈ ప్ర‌క్రియ కూడా ముందుకు సాగేలా క‌నిపించ‌డం లేదు. డీఎస్సీ అభ్య‌ర్థుల నుంచి తీవ్ర వ్య‌తిరేక‌త వ‌స్తున్న నేప‌థ్యంలో... ఇప్పుడు హాడావిడిగా డీఎస్సీ కి సంబంధించి నోటిఫికేషన్ విడుదల తేదీ ఖరారు చేసింది కూటమి ప్రభుత్వం. అదే విధంగా సిలబస్ పై కూడా స్పష్టత ఇచ్చింది. 

నోటిఫికేష‌న్ ఎప్పుడంటే..
ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్ 2024 ను నవంబరు 3వ తేదీన‌ విడుదల చేయాలని నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ఈ డీఎస్సీ ద్వారా 16,347 పోస్టులను భర్తీ చేయడానికి నిర్ణయించింది ప్రభుత్వం. అంతకుముందు టెట్ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. గత కొద్దిరోజులుగా టెట్ పరీక్షలు జరుగుతున్నాయి. వీటికి సంబంధించి ఫలితాలను నవంబర్ 2వ తేదీన‌ ప్రకటించేందుకు రంగం సిద్ధం అవుతోంది. టెట్ ఫలితాలు విడుదల తర్వాత మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని అధికారులు ప్రతిపాదించారు. ఈ విషయంలో మంత్రి నారా లోకేష్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

డీఎస్సీ సిలబస్‌లో..
డిసెంబర్ 31 నాటికి ఎట్టి పరిస్థితుల్లో పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తి చేయాల‌నే ఆలోచ‌న‌లో ప్రభుత్వం ఉంది.  డీఎస్సీ సిలబస్‌లో ఎలాంటి మార్పు లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. యధావిధిగా పాత సిలబస్‌ను కొనసాగించడానికి నిర్ణయించింది. 

గ‌త ప్ర‌భుత్వ పుణ్య‌మే.. ఈ డీఎస్సీ నోటిఫికేష‌న్‌..
వాస్తవానికి వైసీపీ ప్రభుత్వం 6100 పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ జారీచేసింది. కానీ ఈలోగా ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో ఈ ప్రక్రియ వాయిదా పడింది. దానికి కేవ‌లం 10,200 పోస్టులు జతచేస్తూ ప్ర‌స్తుత కూటమి ప్రభుత్వం మెగా డీఎస్సీ నోటిఫికేషన్ అంటూ.. నోటిఫికేష‌న్‌ను జారీ చేయనుంది. ఈ ప్ర‌భుత్వం కేవ‌లం 10200 పోస్టుల‌కు మాత్ర‌మే నోటిఫికేష‌న్ ఇచ్చింది. ఈ పోస్టుల భ‌ర్తీ వివిధ కార‌ణాలు చూపుతూ.. ఆల‌స్యం అయ్యే అవ‌కాశం ఉంది. ఈ డీఎస్సీ ప్ర‌క్రియ కూడా పూర్తి చేసి అభ్య‌ర్థుల‌కు ఉద్యోగాలు వ‌చ్చే వ‌ర‌కు న‌మ్మ‌కం లేదు చాలా మంది అభ్య‌ర్థుల‌కు.

Published date : 11 Oct 2024 10:31AM

Photo Stories