Skip to main content

AP DSC 2024 Notification Issues : ఇది మోగా డీఎస్సీ కాదు.. ద‌గా డీఎస్సీ.. ఎలా అంటే...?

సాక్షి ఎడ్యుకేష‌న్ : మొద‌టి సంత‌కం డీఎస్సీ నోటిఫికేషన్ ఫైల్ పై తొలి సంతకం చేసిన‌ ప్ర‌స్తుత ఏపీ సీఎం చంద్రబాబు.. నిరుద్యోగుల‌ను దారుణంగా మోసం చేశాడు. సీఎం చేసిన తొలి సంతకానికి విలువ లేకుండా పోయింది.
Chandrababu signs DSC notification, deceiving unemployed  AP CM Chandrababu's signature on DSC file criticized  AP CM Chandrababu Naidu Signs First File on Mega DSC Notification 2024

ఇదిగో మెగా డీఎస్సీ.. అదిగో మెగా డీఎస్సీ నోటిఫికేష‌న్ ఇస్తామంటూ... నిరుద్యోగుల‌ను దారుణంగా ద‌గా చేస్తున్నారు. ఇది మెగా డీఎస్సీ కాదు.. ఇది కేవ‌లం చోటా డీఎస్సీ మాత్ర‌మే అంటూ.. మ‌రి కొంద‌రు అభ్య‌ర్థులు ఆందోళ‌న చేస్తున్నారు.  

తొలి సంతకానికి విలువ లేకుండా పోయింది..
అధికారంలోకి వచ్చిన వెంటనే డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇచ్చి ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తామన్న హామీ గాల్లో కలిసిపోయింది. నవంబర్‌ 6న మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇస్తామంటూ దాగుడుమూతలు ఆడుతూ వచ్చిన సర్కారు చివరకు చేతులెత్తేసింది.

ఏపీ డీఎస్సీలో పోస్టుల సంఖ్య పెంచాలంటూ.. అభ్యర్థులు ఆందోళన చేపట్టారు. కేవ‌లం ఒక్క అనంతపురం జిల్లాలోనే దాదాపు 30 వేల మంది ఎస్‌జీటీ పోస్టులకు పోటీపడుతుండగా.. అత్యల్పంగా పోస్టులు కేటాయించి అన్యాయం చేస్తారా అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు. ఇలా ఏపీ రాష్ట్ర‌వ్యాప్తంగా తీసుకుంటే... పోటీ తీవ్ర‌త ఎంత ఉంటుందో ఊహించుకోవ‌చ్చు. రాష్ట్ర‌వాప్తంగా వివిధ జిల్లాల డీఎస్సీ అభ్య‌ర్థులు డీఎస్సీ పోస్టుల సంఖ్య పెంచాలంటూ.. డిమాండి చేస్తున్నారు. 16,347 టీచర్‌ పోస్టుల భర్తీ ఫైల్‌పై ముఖ్యమంత్రి చేసిన తొలి సంతకానికి విలువ లేకుండా పోయింది. నవంబర్‌ 6న మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇస్తామంటూ దాగుడుమూతలు ఆడుతూ వచ్చిన సర్కారు చివరకు చేతులెత్తేసింది. 

7.50 లక్షల మంది..

ap dsc 2024

గతేడాది డిసెంబర్‌ నుంచి నిద్రాహారాలు మాని శిక్షణకే అంకితమైన దాదాపు 7.50 లక్షల మంది ఉపాధ్యాయ అభ్యర్థులను తీవ్ర నిస్పృహకు గురి చేస్తూ త్వరలో నోటిఫికేషన్‌ ఇస్తామంటూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ శాసనసభలో ప్రకటించడంతో సర్కారు వాయిదాల వ్యూహం బయటపడింది. ఈ వాయిదాల పర్వాన్ని గమనిస్తున్న నిరుద్యోగులు, విద్యారంగ నిపుణులు 2019కి ముందు టీడీపీ పాలనను గుర్తు చేసుకుంటున్నారు. గతంలోనూ చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సర్వీస్‌ కమిషన్‌ నుంచి విడుదలైన పలు నోటిఫికేషన్లు వాయిదా పడ్డాయని, ప్రభుత్వంలో ఉన్నవారే పోస్టుల భర్తీని ఆలస్యం చేసేందుకు కోర్టుల్లో కేసులు వేయిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

గత ప్రభుత్వం ఒక్క డీఎస్సీ నోటిఫికేషన్‌ కూడా ఇవ్వలేదు. మా హయాంలో 11 నోటిఫికేషన్లు ఇచ్చాం. వచ్చే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించటాన్ని లక్ష్యంగా పెట్టుకున్నాం. దీన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తాం. గతంలో నోటిఫికేషన్లపై కేసులు పడ్డాయి. వాటిపై అధ్యయనం చేసి డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇవ్వాలని అధికారులకు చెప్పాం.. అని శాసన సభలో ఓ ప్రశ్నకు సమాధానంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ పేర్కొన్నారు. ఆర్నెళ్లలో ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తామని జూన్‌లో ఆయన హామీ ఇవ్వగా నవంబర్‌ 6న నోటిఫికేషన్‌ జారీ అవుతుందంటూ టీడీపీ అనుకూల మీడియాలో ప్రచారం జరిగింది. కేసులపై అధ్యయనం జరిపి న్యాయ వివాదాలను పరిష్కరించాక నోటిఫికేషన్‌ ఇవ్వాలంటే అది ఎప్పటికి సాధ్యమవుతుందని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.

ఆర్థిక భారంతో..
గత ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరిలో 6,100 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మే నెల నాటికి ప్రక్రియ పూర్తై జూన్‌లో పాఠశాలల పునఃప్రారంభం నాటికి ఉద్యోగాల్లో ఉంటామన్న ఆశతో లక్షల మంది అభ్యర్థులు ప్రైవేట్‌ ఉద్యోగాలను వదిలేసి పూర్తికాలం శిక్షణ పొందుతున్నారు. 

త్వరలో అంటే...?

mla nara lokesh

గత ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రకటించిన డీఎస్సీని కూటమి సర్కారు మెగా డీఎస్సీ ఇస్తామంటూ రద్దు చేసింది. 16,347 పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్‌ అంటూ ప్రచారం చేసింది. తర్వాత నవంబర్‌ తొలివారంలో నోటిఫికేషన్‌ అంటూ రకరకాల తేదీలను తెరపైకి తెచ్చారు. తీరా గడువు దాటినా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. అది కూడా గ‌త వైఎస్సార్‌ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిన 6100 పోస్టులతో పాటు.. దానికి మరో 10 వేలకు పైగా పోస్టులు క‌లిపి ఈ నోటిఫికేష‌న్ ఇవ్వ‌నున్నారు. డీఎస్సీ నోటిఫికేషన్ ఫైల్ పై తొలి సంతకం చేసిన‌ ప్ర‌స్తుత ఏపీ సీఎం చంద్రబాబు.. మొద‌టి సంత‌కంతోనే.. నిరుద్యోగుల‌ను దారుణంగా మోసం చేశాడు.

తాజాగా అసెంబ్లీ సమావేశాల సందర్భంగా న్యాయ వివాదాలపై అధ్యయనం చేశాక త్వరలో నోటిఫికేషన్‌ ఇస్తామని తాపీగా ప్రకటించడంతో అభ్యర్థుల్లో ఆందోళన మొదలైంది. ఏ తరహా న్యాయ వివాదాలు ఉన్నాయో.. అవి ఎప్పటికి పరిష్కారం అవుతాయో అంతుబట్టని పరిస్థితి నెలకొంది. కూటమి ప్రభుత్వం ఇచ్చిన తొలి హామీ డీఎస్సీ నోటిఫికేషన్‌పై ఐదు నెలలైనా స్పష్టత రాకపోవడంతో నిస్పృహకు గురవుతున్నారు. ఫిబ్రవరిలో డీఎస్సీ కోసం శిక్షణ తీసుకుంటే తీరా ఆ నోటిఫికేషన్‌ రద్దు చేశారని.. చేస్తున్న ఉద్యోగాలను వదిలేసి ఏడాది కాలంగా ఆర్థికంగా నష్టపోయామని అభ్యర్థులు వాపోతున్నారు.  నోటిఫికేషన్‌ను ఇప్పటికే రెండుసార్లు వాయిదా వేశారని మంత్రి చెబుతున్న త్వరలో ఎప్పుడు వస్తుందని ప్రశ్నిస్తున్నారు.

Published date : 15 Nov 2024 03:33PM

Photo Stories