Mega DSC : మెగా డీఎస్సీ నోటిఫికేషన్ జారీపై నీలినీడలు.. కారణం!
Sakshi Education
విశాఖపట్నం: మెగా డీఎస్సీ మాటేమోకానీ.. ఆ బూచితో ప్రస్తుతం పనిచేస్తున్న ఉపాధ్యాయుల ప్రమోషన్లకు కూటమి ప్రభుత్వం కోతపెడుతోంది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో నెలవారీ ఉద్యోగోన్నతుల ప్రక్రియ ఉండేది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాటి ఊసే లేదు. విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో ఉన్న మున్సిపల్ మేనేజ్‌మెంట్ స్కూళ్లలో అన్ని క్యాడర్లు కలిపి ఇటీవల 11 మందికి ప్రమోషన్లు ఇచ్చారు. డీఎస్సీ కోసం 109 ఖాళీలు చూపించగా.. వీటిలో 30 శాతం కోటా మేరకు ప్రమోషన్లు కల్పించాలి. ఈ విషయంలో జరిగిన తప్పిదాలతో మరోమారు ఖాళీల గుర్తింపుపై రాష్ట్ర స్థాయిలో కసరత్తు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం రోజుకో నిర్ణయం తీసుకుంటుండటంతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ జారీపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Published date : 26 Nov 2024 06:52PM