Skip to main content

Nara Lokesh Gives Clarity On DSC Notification 2025 : మేము డీఎస్సీ నోటిఫికేష‌న్అ ప్పుడే ఇస్తాం... కానీ..!

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో డీఎస్సీ-2025 నోటిఫికేష‌న్ ఎప్పుడు వ‌స్తుందో... తెలియ‌క అయోమ‌యంలో ఉన్నారు. ఇటీవ‌ల ఏపీ కూట‌మి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ ముగియగానే... డీఎస్సీ నోటిఫికేష‌న్ ఇస్తాం అని చెప్పిన విష‌యం తెల్సిందే.
Minister Nara Lokesh Gives Clarity On DSC Notification 2025

స‌రిగ్గా ఇలాగే...  పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ ముగియగానే మెగా డీఎస్సీకి నోటిఫికేషన్‌ ఇవ్వనున్నట్లు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ కూడా చెప్పారు. మార్చిలో డీఎస్సీ ప్రక్రియ ప్రారంభించి విద్యా సంవత్సరం ప్రారంభంలోనే ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తామని నారా లోకేశ్  ప్రకటించారు. ఇలా తండ్రికొడుకు డీఎస్సీ అభ్య‌ర్థుల‌ను దార‌ణంగా మోసం చేస్తున్నారు. 

➤☛ AP DSC 2025 Notification Updates : 16,347 పోస్టుల డీఎస్సీ నోటిఫికేష‌న్‌పై కీల‌క ప్ర‌క‌ట‌న‌... ఇంకా...!

మెగా డీఎస్సీ పేరుతో కూటమి ప్రభుత్వం అభ్యర్థులతో ఆటలాడుతోంది.  ఇప్పటికి 8 నెలలు పూర్తయినా డీఎస్సీపై ఎలాంటి ప్రకటనా చేయకపోవడంపై ఉపాధ్యాయ అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమను ప్రభుత్వం నిలువునా మోసంచేసిందంటూ కృష్ణా జిల్లా అవనిగడ్డలో డీఎస్సీ అభ్యర్థులు రోడ్డెక్కారు. గత ప్రభుత్వంలో ఇచ్చిన డీఎస్సీ నోటిఫికేషన్‌ను కూటమి ప్రభుత్వం రద్దు చేసి, మెగా డీఎస్సీ పేరుతో తమ జీవితాలతో ఆటలాడుతోందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు. 

నోటిఫికేషన్‌ ఇవ్వకపోగా పలు సాకులతో...
కానీ 8 నెలలు అవుతున్నా నోటిఫికేషన్‌ ఇవ్వకపోగా పలు సాకులతో వాయిదా వేస్తున్నారని ఉపాధ్యాయ అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నెల క్రితమే జిల్లాల్లో ఉపాధ్యాయ పోస్టుల ఖాళీల వివరాలను తెప్పించుకుంది. ఆ వివరాలను కూడా వెల్లడించలేదు. నోటిఫికేషన్‌పై నిరుద్యోగులను ఇన్ని నెలలుగా మభ్యపెట్టి, వాస్తవ పరిస్థితులను వెల్లడించకపోవడంతో అభ్యర్థులు రోడ్డెక్కుతున్నారు. 

25 వేల టీచర్‌ పోస్టులు భర్తీ చేస్తామని..
తాము అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీతో 25 వేల టీచర్‌ పోస్టులు భర్తీ చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన చంద్రబాబునాయుడు.. తీరా సీఎం అయ్యాక కేవ‌లం.. గ‌త ప్ర‌భుత్వం ఇచ్చిన 6,100 పోస్టుల‌తో క‌లిపి కేవ‌లం 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ ఇస్తామంటూ తొలి సంతకం చేసి అభ్య‌ర్థుల‌ను మోసం చేశారు.

Published date : 03 Feb 2025 09:18AM

Photo Stories