Cyber Crime Awareness : సైబర్ నేరాల నుంచి దూరంగా ఉండండి.. అవగాహన తప్పనిసరి!

వనపర్తి: సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలని సైబర్ క్రైం డీఎస్పీ ఎన్‌బీ రత్నం సూచించారు. బుధవారం జిల్లాకేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. వివిధ రకాలుగా సైబర్ నేరగాళ్లు ఫోన్లు చేసి ఇబ్బంది పెడుతుంటారు. మనల్ని అయోమయంలో పడేసి వారికి కావాల్సిన వివరాలను సేకరిస్తారు. డీఎస్పీ సూచనలు..
1. సైబర్ నేరగాళ్లు డిజిటల్ అరెస్ట్, సైబర్ స్టాకింగ్, వర్క్ ఫ్రం హోం పేరుతో మనల్ని ఆకర్షితులను చేస్తూ, కొన్నిసార్లు భయభ్రాంతులకు గురిచేస్తూ డబ్బులు కాజేస్తారన్నారు.
2. గుర్తుతెలియని వ్యక్తుల ఫోన్ కాల్స్‌కు స్పందించవద్దు.
3. ఈ నేరగాళ్ల కారణంగా మీరు ఒకవేళ డబ్బులు నష్టపోతే వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ 1930 కి ఫిర్యాదు చేయండి.
4. నేటి సమాజంలో ఇంటర్నెట్, టెక్నాలజీ వినియోగం పెరిగింది, మీ వ్యక్తిగత సమాచారాన్ని సోషల్ మీడియాలో నమోదు చేయొద్దు. ఈ సోషల్ మీడియా కారణంగా కూడా అనేక సమస్యలను ఎదుర్కుంటారు.
5. విద్యార్థులు బెట్టింగ్ యాప్‌లకు దూరంగా ఉండాలి.
అందరు ఈ విషయంలో ఎంత జాగ్రత్తలు పాటిస్తే, అంత సురక్షితంగా ఉంటారని
కార్యక్రమంలో పట్టణ ఎస్‌ఐ హరిప్రసాద్, సైబర్ క్రైం ఎస్‌ఐ రవిప్రకాష్, ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)