Skip to main content

AP DSC Bad News 2024 : ఇది మెగా డీఎస్సీ కాదు.. చోటా డీఎస్సీ మాత్ర‌మే... అభ్య‌ర్థుల‌ను దారుణంగా మోసం..!

సాక్షి ఎడ్యుకేష‌న్ : నేడే రేపో.. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో డీఎస్సీ నోటిఫికేష‌న్ విడుద‌ల చేయ‌నున్నారు. అయితే ఎన్నిక‌ల స‌మ‌యంలో భారీగా డీఎస్సీ ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్ ఇస్తామ‌ని చెప్పి.. అధికారంలోకి వ‌చ్చాక‌... కేవ‌లం 16,347 ఉద్యోగాల‌కు మాత్రం నోటిఫికేష‌న్ ఇస్తామ‌ని అంటున్నారు.
AP DSC 2024 Candidates Protest  Andhra Pradesh DSC notification release announcement  Andhra Pradesh government to offer 16,347 DSC jobs after elections  Upcoming DSC job opportunities in Andhra Pradesh

అది కూడా గ‌త వైఎస్సార్‌ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిన 6100 పోస్టులతో పాటు.. దానికి మరో 10 వేలకు పైగా పోస్టులు క‌లిపి ఈ నోటిఫికేష‌న్ ఇవ్వ‌నున్నారు. డీఎస్సీ నోటిఫికేషన్ ఫైల్ పై తొలి సంతకం చేసిన‌ ప్ర‌స్తుత ఏపీ సీఎం చంద్రబాబు.. మొద‌టి సంత‌కంతోనే.. నిరుద్యోగుల‌ను దారుణంగా మోసం చేశాడు. మెగా డీఎస్సీ అంటే ఇది కాదు.. ఇది కేవ‌లం చోటా డీఎస్సీ మాత్ర‌మే అంటూ.. అభ్య‌ర్థులు ఆందోళ‌న చేస్తున్నారు. 

➤ Andhra Pradesh DSC 2024 School Assistants Social Studies Syllabus

డీఎస్సీలో పోస్టుల సంఖ్య పెంచాలంటూ ఆందోళ‌న‌.. :
ఏపీ డీఎస్సీలో పోస్టుల సంఖ్య పెంచాలంటూ.. అభ్యర్థులు ఆందోళన చేపట్టారు. కేవ‌లం ఒక్క అనంతపురం జిల్లాలోనే దాదాపు 30 వేల మంది ఎస్‌జీటీ పోస్టులకు పోటీపడుతుండగా.. అత్యల్పంగా పోస్టులు కేటాయించి అన్యాయం చేస్తారా అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు. ఇలా ఏపీ రాష్ట్ర‌వ్యాప్తంగా తీసుకుంటే... పోటీ తీవ్ర‌త ఎంత ఉంటుందో ఊహించుకోవ‌చ్చు. రాష్ట్ర‌వాప్తంగా వివిధ జిల్లాల డీఎస్సీ అభ్య‌ర్థులు డీఎస్సీ పోస్టుల సంఖ్య పెంచాలంటూ.. డిమాండి చేస్తున్నారు. 

➤ Andhra Pradesh DSC 2024 SGT Syllabus

➤ Andhra Pradesh DSC 2024 School Assistant Telugu Syllabus

పెద్ద సంఖ్యలో అభ్యర్థులు..
ఈ డీఎస్సీ పోస్టుల సంఖ్య పెంచాలంటూ... న‌వంబ‌ర్ 4వ తేదీన (సోమవారం) పెద్ద సంఖ్యలో అభ్యర్థులు అనంతపురం ఆర్ట్స్‌ కళాశాల నుంచి కలెక్టరేట్‌ వరకు ర్యాలీ చేశారు. కలెక్టరేట్‌ ఎదుట రాస్తారోకో చేశారు. దీంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్‌ స్తంభించింది. రాస్తారోకో విరమించాలని కోరిన పోలీసులతో అభ్యర్థులు వాగ్వాదానికి దిగారు. 

అధికారులే స్వయంగా వ‌చ్చి...
అధికారులే స్వయంగా వచ్చి తమ గోడు వింటేనే ఆందోళన విరమిస్తామని భీష్మించారు. పోలీసు అధికారుల అభ్యర్థన మేరకు డీఆర్‌ఓ వారి వద్దకు వచ్చారు. డీఎస్సీ అభ్యర్థులు వారి సమస్యలను డీఆర్‌వోకు వివరించి, వినతిపత్రం ఇచ్చారు. తమ డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. 

➤ Andhra Pradesh DSC 2024 School Assistant English Syllabus

➤ Andhra Pradesh DSC 2024 School Assistant Biological Science Syllabus

కేవలం 181 ఎస్‌జీటీ పోస్టులే..
అనంతపురం జిల్లాకు ఈ డీఎస్సీలో  కేవలం 181 ఎస్‌జీటీ పోస్టులే కేటాయించి వేలమంది నిరుద్యోగ యువతకు ప్రభుత్వం అన్యాయం చేస్తోందని విమర్శించారు. నిరుద్యోగుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కనీసం వెయ్యి ఎస్‌జీటీ పోస్టులు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. జీఓ 117ను రద్దు చేయాలని కోరారు. ఏకోపాధ్యాయ పాఠశాలల్లో ద్వితీయ ఉపాధ్యాయుల నియామకం చేపట్టాలన్నారు. జిల్లా మొత్తానికి ఒకేరకమైన పరీక్ష పత్రంతో పరీక్ష నిర్వహించాలన్నారు.

➤ Andhra Pradesh DSC 2024 School Assistants Physical Science Syllabus

➤ Andhra Pradesh DSC 2024 School Assistants Mathematics Syllabus

ఈ ఆందోళన కార్యక్రమంలో ఏఐవైఎఫ్‌ జిల్లా కార్యదర్శి సంతోష్‌కుమార్, డీవైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు నూరుల్లా, డీఎస్‌సీ అభ్యర్థులు ముజీబ్, రాము  తదితరులు పాల్గొన్నారు.

☛➤ DSC Ranker Success Story : ఒక‌టి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఒకేసారి 6 ప్ర‌భుత్వం ఉద్యోగాలు కొట్టానిలా... కానీ..

➤☛ Brother and Sister Success Story : ఒకేసారి మేము ప్రభుత్వ ఉద్యోగాలు కొట్టాం ఇలా.. మా చిన్నప్పుడే నాన్న‌ చనిపోయినా.. మా అమ్మ...

Published date : 06 Nov 2024 09:32AM

Photo Stories