Municipal Teachers: మునిసిపల్ టీచర్లకు 70 శాతం పదోన్నతులు ఇవ్వాలి
పాఠశాల విద్య కమిషనర్ సూచనలతో 100 శాతం పోస్టులను డీఎస్సీకి కేటాయించడంతో మున్సిపల్ టీచర్లు నష్టపోతున్నారని అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు హరికృష్ణ, మాగంటి శ్రీనివాసరావు నవంబర్ 15న పేర్కొన్నారు.
ఈ సమస్యను పరిష్కరించి పదోన్నతులకు రీ షెడ్యూల్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. పదోన్నతులు, డీఎస్సీ నిష్పత్తి 70:30గా ఉం డాలని సూచించారు.
చదవండి: Regularise KGBV Teachers: ‘కేజీబీవీల మహిళా టీచర్లను రెగ్యులర్ చేయాలి’
ప్రస్తుతం నిర్వహిస్తోన్న పదోన్నతుల ప్రక్రియలో కొన్ని మునిసిపాలి టీల్లో పదోన్నతులకు అసలు ఒక పోస్ట్ కూడా చూపించకుండా మొత్తం పోస్టులను డీఎస్సీకి కేటాయించటం సరికాదన్నారు.
▶ Join our WhatsApp Channel: Click Here ▶ Join our Telegram Channel: Click Here |
▶ Follow our YouTube Channel: Click Here ▶ Follow our Instagram Page: Click Here |
ప్రభుత్వ విభాగాల్లో చేపట్టినట్టే ఉపాధ్యాయ పదోన్నతులు కూడా 70: 30 నిష్పత్తిని అమలు చేయాలని కోరారు. జీవో 117 రద్దు ద్వారా చాలా పోస్టులు కొత్తగా ఏర్పడతాయని, ప్రస్తుతం ఉన్న పోస్టుల్లో అర్హత గల ముని సిపల్ ఉపాధ్యాయులకు పదోన్నతి కల్పిం చాలని అభ్యర్థించారు.