Skip to main content

Job Mela: స్కీల్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ ట్రైనింగ్‌ వారి అధ్వర్యంలో జాబ్‌మేళా..ఎప్పుడు? ఎక్కడంటే..

సత్తెనపల్లి: డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ స్కీల్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ ట్రైనింగ్‌ వారి అధ్వర్యంలో ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్‌ఎస్‌డీసీ), ఎంప్లాయిమెంట్‌ ఎక్చేంజ్‌, సీడాప్‌ అధ్వర్యంలో జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు పల్నాడు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఈ.తమ్మాజిరావు న‌వంబ‌ర్‌ 8న తెలిపారు.
Job Mela under Skill Development and Training   "Job fair organized by APSSDC and CEDP in Sattenapalli "Employment Exchange job fair in Sattenapalli

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న‌వంబ‌ర్‌ 12న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు సత్తెనపల్లి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో జాబ్‌ డ్రైవ్‌ జరుగుతుందన్నారు. ఈ జాబ్‌ డ్రైవ్‌కు వీల్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌, జోసియల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, అక్రో సాఫ్ట్‌ సొల్యూషన్‌ వంటి పలు రకాల కంపెనీలు హాజరవుతాయన్నారు.

చదవండి: KGBV Jobs 2024: కేజీబీవీలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

వేతనం వారి విద్యార్హతను బట్టి సుమారు రూ.14 వేల నుంచి రూ. 30 వేల వరకు ఉండవచ్చునన్నారు. ఈ జాబ్‌ డ్రైవ్‌కు ఎస్‌.ఎస్‌.సి, ఇంటర్‌, ఐటీఐ, డిగ్రీ, బీటెక్‌, డిప్లొమా, ఫార్మసి, పీజీ విభాగం వరకు విద్యనభ్యసించి, 18–40 సంవత్సరాల వయసు గల నిరుద్యోగ యువతీ, యువకులు వారి బయోడేటా లేదా రెస్యూమ్‌, ఎడ్యుకేషన్‌ సర్టిఫికేట్స్‌ జిరాక్స్‌, ఆధార్‌ నకలు, పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫోటోల తో నేరుగా ఇంటర్వ్యూ కు హాజరు కాగలరన్నారు.

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here

ఔత్సాహిక యువతీ, యువకులు ముందుగా http://naipunyam.ap.gov.in/ అనే వెబ్‌సైట్‌ నందు రిజిస్టర్‌ చేసుకోగలరన్నారు. రిజిస్ట్రేషన్‌ పూర్తి చేసుకోనటువంటి యువతీ, యువకులు జాబ్‌ డ్రైవ్‌ జరుగు ప్రదేశంలో రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చునన్నారు. ఇతర వివరాలకు రామకృష్ణరెడ్డి– 80743 93466, అంజిరెడ్డి–9494986164 సంప్రదించాల న్నారు. ఈ జాబ్‌డ్రైవ్‌ను సత్తెనపల్లి నియోజకవర్గ పరిసర ప్రాంత మువతీ, యువకులు వినియోగించుకోవాలని ఆయన కోరారు.

Published date : 11 Nov 2024 09:14AM

Photo Stories