Skip to main content

KGBV Jobs 2024: కేజీబీవీలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

పాడేరు : ఏపీ సమగ్ర శిక్ష సొసైటీ (పాఠశాల విద్యా శాఖ) ద్వారా నిర్వహిస్తున్న జిల్లాలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న 28 నాన్‌ టీచింగ్‌ సిబ్బంది పోస్టులను ఔట్‌సోర్సింగ్‌ విధానంలో భర్తీ చేస్తున్నట్టు జిల్లా విద్యాశాఖాధికారి బ్రహ్మాజీరావు తెలిపారు. 2024–25 విద్యా సంవత్సరం ఏడాది కాలానికి అర్హత, ఆసక్తి కలిగిన మహిళ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు.
KGBV Jobs 2024  District Education Officer Brahmaji Rao announcing job vacancies  Women candidates invited to apply for non-teaching staff positions  Application form for non-teaching staff positions  Vacant non-teaching staff posts in Kasturba Gandhi Girls' Vidyalayas
KGBV Jobs 2024

టైప్‌–3 కేజీబీవీల్లో 25 పోస్టులకు గాను హెడ్‌కుక్‌–7, అసిస్టెంట్‌ కుక్‌–9, డే ఆండ్‌ నైట్‌ వాచ్‌ ఉమెన్‌–3, స్కావెంజర్స్‌–6, స్వీపర్లు–5 ఖాళీలు ఉన్నాయన్నారు. టైప్‌–4 కేజీబీవీల్లో 3 పోస్టులకు గాను చౌకిధార్‌–1, హెడ్‌కుక్‌–1, అసిస్టెంట్‌ కుక్‌–1 పోస్టులను భర్తీ చేస్తామన్నారు. హెడ్‌కుక్‌, అసిస్టెంట్‌ కుక్‌, స్కావెంజర్స్‌, స్వీపర్‌ పోస్టులకు విద్యార్హత ప్రామాణికం కాదన్నారు.

Software Jobs: ఐటీ కంపెనీలో ఉద్యోగాలు.. రూ. 5లక్షల ప్యాకేజీ, ఇంటర్వ్యూ తేదీ ఇదే

డై ఆండ్‌ నైట్‌ వాచ్‌ ఉమెన్‌, చౌకిధార్‌ పోస్టులకు మాత్రం 7వ తరగతి విద్యార్హత ఉండాలన్నారు. అభ్యర్థుల కనీస వయసు ఓసీ అభ్యర్థులకు జూలై ఒకటి 2024 నాటికి 42ఏళ్లు, ఎక్స్‌ సర్వీస్‌ మెన్‌–45 ఏళ్లు, ఎస్సీ,ఎస్టీ బీసీ, ఈడబ్ల్యూఎస్‌ వారికి 47 ఏళ్లు, పీహెచ్‌ వారికి 52 ఏళ్లు నిండి ఉండాలన్నారు.

Outsourcing Jobs: పరీక్ష లేకుండానే ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాలు.. పూర్తి వివరాలు ఇవే

దరఖాస్తులను ఈనెల 7వ తేదీ నుంచి 15వ తేదీ వరకు మండల విద్యాశాఖాధికారి కార్యాలయాల్లో ఆఫ్‌లైన్‌ పద్ధతిలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎంపికై న అభ్యర్థులను అక్టోబర్‌ 22 నుంచి విధుల్లోకి తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

Published date : 09 Oct 2024 03:50PM

Photo Stories