Skip to main content

Job Mela: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. జాబ్‌మేళా, జీతం నెలకు రూ. 30వేలు

job mela
job mela

రాయచోటి(జగదాంబ సెంటర్‌)రాయచోటి పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో నవంబర్‌ 1న జిల్లా స్థాయి జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌ నాగార్జున, ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ పి.శివశంకర్‌ తెలిపారు.

మున్సిపల్‌ డిపార్ట్‌మెంట్‌లో జూనియర్‌ అసిస్టెంట్‌ ఉద్యోగాలు: Click Here

ఐసీఐసీఐ బ్యాంకు, ముత్తూట్‌ ఫైనాన్స్‌, టీవీఎస్‌ ఇండియా లిమిటెడ్‌, యంగ్‌ ఇండియా కంపెనీలు పాల్గొంటాయని పేర్కొన్నారు. పది, ఇంటర్‌, డిప్లొమో, ఏదైనా డిగ్రీ పాసైన వారు అర్హులన్నారు. ఉద్యోగాలకు ఎంపికై న వారికి రూ.18 వేల నుంచి రూ.30 వేల వరకు జీతం ఉంటుందన్నారు. ఆసక్తి గల నిరుద్యోగులు విద్యార్హతల ధ్రువీకరణ పత్రాలతో హాజరుకావాలని వారు కోరారు.

పోస్టుల వివరాలు

కంపెనీ పేరు ఉద్యోగం పేరు ఖాళీలు

ఐసీఐసీఐ జూనియర్‌ ఆఫీసర్‌ 50

ముతూట్‌ ఫైనాన్స్‌ జూనియర్‌ రిలేషన్‌షిప్‌ 10

ఎగ్జిక్యూటివ్‌

టీవీఎస్‌ ఇండియన్‌ లిథియమ్‌ బ్యాటరీస్‌ 50 లిమిటెడ్‌ అసెంబ్లింగ్‌

యంగ్‌ ఇండియా మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటివ్‌ 30

Published date : 30 Oct 2024 08:31PM

Photo Stories