AP Government Jobs: మెడికల్ కాలేజీల్లో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం..
Sakshi Education
తిరుపతి తుడా: తిరుపతిలోని శ్రీవెంకటేశ్వర వైద్య కళాశాల, రుయా ఆసుపత్రి, ప్రసూతి ఆసుపత్రి, శ్రీపద్మావతి నర్సింగ్ కళాశాల, ప్రభుత్వ స్కూల్ ఆఫ్ నర్సింగ్, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉద్యోగ నియామకాల కోసం నోటిఫికేషన్‌ను విడుదల చేసినట్లు ఎస్వీ వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పీఏ చంద్రశేఖరన్ ఒక ప్రకటనలో తెలిపారు.
AP Government Jobs
డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, విజయవాడవారి ఆదేశాల మేరకు గురువారం పలు ఉద్యోగాలకు నూతన నోటిఫికేషన్‌ను విడుదల చేశామని తెలియజేశారు. ఉద్యోగాల వివరాలు, అర్హతల కోసం https://tirupati.ap.gov.in, https://chittoor.ap.gov.in, www.svmc tpt.edu.in వెబ్‌సైట్లను సంప్రదించాలని కోరారు. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు దరఖాస్తులను ఈ నెల 22వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు ఎస్వీ వైద్య కళాశాలలో అందజేయాలని సూచించారు.