Andhra Pradesh Govt Jobs 2025: మహిళా శిశు సంక్షేమ శాఖలో పోస్టులు.. దరఖాస్తుకు చివరి తేది ఇదే
Sakshi Education
రాజమహేంద్రవరం రూరల్: జిల్లా మహిళా, శిశు సంక్షేమ, సాధికారిత అధికారి కార్యాలయంలో రాజమహేంద్రవరంలోని డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రోటెక్షన్ యూనిట్‌లో ఖాళీగా ఉన్న డీసీపీవో పోస్టు–1కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. జిల్లా మహిళా, శిశు సంక్షేమ సాధికారత అధికారి కె.విజయకుమారి ఈ విషయాన్ని మంగళవారం ప్రకటనలో తెలిపారు. కలెక్టర్ ఉత్తర్వుల మేరకు నోటిఫికేషన్ జారీ చేశామన్నారు.
Andhra Pradesh Govt Jobs 2025 Jobs In Jobs in Women & Child Welfare department
అర్హులైన అభ్యర్థులు ఫిబ్రవరి ఆదో తేదీ వరకూ దరఖాస్తులు అందజేయవచ్చన్నారు. ఆసక్తి కలవారు eastgodavari.ap.gov.in వెబ్‌సైట్ నుంచి దరఖాస్తు (సీవీ) డౌన్‌లోడ్ చేసుకోవాలన్నారు.
బొమ్మూరు మహిళా ప్రాంగణం ఆవరణలోని జిల్లా మహిళా, శిశు అభివృద్ధి సాధికారిత కార్యాలయంలో నమూనా పొందవచ్చన్నారు. టర్‌మ్స్ ఆఫ్ రిఫరెన్స్(టీవోఆర్) ప్రకారం పూర్తి చేసి, అన్ని రకాల ధ్రువీకరణ పత్రాల జిరాక్సులు జతచేసి ఫిబ్రవరి ఆరోతేదీ సాయంత్రం 5 గంటలలోపు కార్యాలయంలో అందజేయాలని కోరారు.