Good News For Students: పరీక్షలో ఫెయిలైన విద్యార్థులకు గుడ్‌న్యూస్.. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
Sakshi Education
కర్నూలు(సెంట్రల్): రాయలసీమ యూనివర్సిటీ పరిధిలో 2015, 2016, 2017, 2018 సంవత్సరాల్లో డిగ్రీ, బీఈడీ (2019 కూడా) కోర్సుల్లో చేరి ఫెయిల్ అయిన వారికి మరోసారి పరీక్ష రాసే అవకాశం కల్పిస్తున్నట్లు వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ ఎన్‌టీకే నాయక్ బుధవారం ఓ ప్రకటనలో తలిపారు. ఆసక్తి ఉన్న ఆయా కోర్సుల విద్యార్థులు జనవరి 31వ తేదీలోపు తగిన రుసుంను ఆయా కళాశాలల ప్రిన్సిపాళ్లకు చెల్లించాలని సూచించారు.
Good News For Students
డిగ్రీ విద్యార్థులకు సంబంధించి ప్రాక్టికల్ పరీక్షలను ఫిబ్రవరి 1 నుంచి 4వ తేదీ వరకు, థియరీ పరీక్షలను ఫిబ్రవరి 6 నుంచి 15వ తేదీ వరకు, బీఈడీ విద్యార్థులకు సంబంధించి ప్రాక్టికల్ పరీక్షలను ఫిబ్రవరి 1 నుంచి 4వ తేదీ వరకు, థియరీ పరీక్షలు ఫిబ్రవరి 6 నుంచి 17వ తేదీ వర కు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.