Degree Results Released: ఆచార్య నాగార్జున వర్సిటీ డిగ్రీ ఫలితాలు విడుదల
Sakshi Education
ఏఎన్‌యూ(గుంటూరు): ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోని సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ (దూర విద్యా కేంద్రం) గతేడాది అక్టోబర్, నవంబర్ నెలల్లో నిర్వహించిన డిగ్రీ కోర్సుల ఫలితాలను బుధవారం విడుదల చేశారు. దూరవిద్యా కేంద్రం డైరెక్టర్ ఆచార్య వి.వెంకటేశ్వర్లు కార్యాలయంలో ఫలితాలు విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ ఈ ఫలితాల్లో బీఏ, బీకాం (జనరల్), (కంప్యూటర్ అప్లికేషన్స్) ఒకటి, రెండు, మూడో సెమిస్టర్ల రెగ్యులర్, సప్లమెంటరీ ఫలితాలు విడుదల చేసినట్లు వెల్లడించారు.
Degree Results Released
దూరవిద్య కేంద్రం పరీక్షల డెప్యూటీ రిజిస్ట్రార్ సయ్యద్ జైనులాబ్దిన్ మాట్లాడుతూ అభ్యర్థులు రీవాల్యుయేషన్‌కు దరఖాస్తు చేసుకోవాలనుకుంటే ఫిబ్రవరి 11లోగా ఒక్కో పేపర్‌కు రూ.770 చెల్లించి ఫిబ్రవరి 14లోగా దూర విద్య కేంద్రం పరీక్షల కో–ఆర్డినేటర్ కార్యాలయానికి దరఖాస్తు అందేలా పంపాలని సూచించారు. ఫలితాలు విడుదల కార్యక్రమంలో దూరవిద్య పరీక్షల కోఆర్డినేటర్ ఆచార్య డి.రామచంద్రన్ పాల్గొన్నారు.