Spl Supplementary Exams : రేపటి నుంచి డిగ్రీ, బీఈడీ స్పెషల్ సప్లిమెంటరీ పరీక్షలు..

కర్నూలు కల్చరల్: రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలో ఈనెల 6వ తేదీ నుంచి మార్చి 15వ తేదీ వరకు డిగ్రీ 1, 2,3, 4,5,6 సెమిస్టర్ల స్పెషల్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వర్సిటీ కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్లు తెలిపారు. వర్సిటీ ఇన్‌చార్జ్ వైస్‌చాన్సలర్ ప్రొఫెసర్ ఎన్‌టీకే నాయక్ ఆదేశాల మేరకు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
Intermediate Practical Exams : ప్రాక్టికల్ పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాల నిఘా... 144 సెక్షన్!
కర్నూలు శ్రీ శంకరాస్ డిగ్రీ కళాశాల, నంద్యాల పీఎస్‌సీ అండ్ కేవీఎస్‌సీ డిగ్రీ కళాశాల, ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కళాశాల, ఆత్మకూరు, బనగానపల్లె, డోన్, నందికొట్కూరు, శ్రీశైలం, పత్తికొండ, ఆళ్లగడ్డ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, ఎమ్మిగనూరు ఎస్‌ఎమ్‌ఎల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. 1 సెమిస్టర్ 141, 2 – 465, 3 – 276, 4 – 177, 5 – 652, 6– 770 మొత్తం 2481 మంది విద్యార్థులు 8004 పేపర్స్ పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు. పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
బీఈడీ స్పెషల్ సప్లిమెంటరీ పరీక్షలు
రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలో ఈనెల 6 నుంచి 17వ తేదీ వరకు బీఈడీ 1, 2,3, 4 సెమిస్టర్ల స్పెషల్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వర్సిటీ కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్లు తెలిపారు. వర్సిటీ ఇన్‌చార్జ్ వైస్‌చాన్స్‌లర్ ప్రొఫెసర్ ఎన్‌టీకే నాయక్ ఆదేశాల మేరకు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
IGNOU Admissions: ఇగ్నో- 2025 ప్రవేశాలకు ప్రవేశాలకు గడువు పొడిగింపు.. ఎప్పటివరకంటే
కర్నూలు శ్రీ శంకరాస్ డిగ్రీ కళాశాల, నంద్యాల పీఎస్‌సీ అండ్ కేవీఎస్‌సీ డిగ్రీ కళాశాల, ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కళాశాల, బనగానపల్లె, డోన్, నందికొట్కూరు, పత్తికొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, ఎమ్మిగనూరు ఎస్‌ఎమ్‌ఎల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. 1వ సెమిస్టర్ 131, 2 – 20, 3 – 72, 4 – 54 మొత్తం 277 మంది విద్యార్థులు 733 పేపర్స్ పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Tags
- special supplementary exams
- Degree Exams
- Supplementary Exams
- degree and b ed exams
- Rayalaseema University
- Degree Students
- special supplementary exams for degree and b ed students
- govt and private degree colleges
- 1 to 6 semester supplementary exams
- february 6th
- degree semester supplementary exams
- Education News
- Sakshi Education News