Degree Semester Results Released: డిగ్రీ సెమిస్టర్ ఫలితాలు విడుదల
Sakshi Education
అనంతపురం ఎడ్యుకేషన్: జిల్లా కేంద్రంలోని కేఎస్‌ఎన్ మహిళా డిగ్రీ కళాశాలలో మూడో సెమిస్టర్ ఫలితాలను సోమవారం ఆ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కేసీ సత్యలత విడుదల చేశారు. మొత్తం 438 మంది విద్యార్థినులు పరీక్షలు రాయగా 390 మంది (89.04 శాతం) ఉత్తీర్ణులయ్యారు.
Degree Semester Results Released
బీఏ (ఆనర్స్)లో 85 మందికి గాను 78 మంది, బీకామ్ (ఆనర్స్)లో 124 మందికి గాను 118 మంది, బీఎస్సీ (ఆనర్స్)లో 229 మందికి గాను 194 మంది విద్యార్థినులు ఉత్తీర్ణత సాధించారు. ఫలితాలను బుధవారం కళాశాల వెబ్‌సైట్‌లో అందబాటులో ఉంచనున్నట్లు ప్రిన్సిపాల్ తెలిపారు. రీవాల్యూయేషన్, పర్సనల్ వెరిఫికేషన్‌కు సంబంధించి ఈ నెల 19వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఒక్కో పేపర్‌కు రూ. 300 చెల్లించాల్సి ఉంటుందన్నారు.