Skip to main content

New Courses in Degree : డిగ్రీలో త్వ‌ర‌లోనే కొత్త కోర్సు ప్ర‌వేశం.. ఇందులోకూడా మార్పులు..!!

విద్యార్థుల‌కు డిగ్రీలో మ‌రో కొత్త కోర్సులు అందుబాటులోకి రానున్నాయి. ఈ మెర‌కు అన్ని విధాలుగా స‌న్నాహాలు చేస్తోంది విద్యామండ‌లి.
Board of education to introduce new course in degree and changes in syllabus

సాక్షి ఎడ్యుకేష‌న్: త్వ‌ర‌లోనే బీఏ డిఫెన్స్ సైన్స్ సెక్యూరిటీ కోర్సును డిగ్రీలో ప్ర‌వేశ పెట్టేందుకు విద్యామండ‌లి అధికారులు క‌స‌ర‌త్తు చేస్తున్నారు. ప్ర‌స్తుతానికి, తొలుత సెలెక్టెడ్ కాలేజీల్లో దీన్ని అమలు చేసి దానికి వచ్చే ఆదరణకు అనుగుణంగా రాష్ట్రవ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేయాలని అధికారులు భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఫ‌లితాలు అనుగుణంగా వ‌స్తే, అన్ని అనుకున్నట్లుగా జరిగితే వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ కోర్సు అందుబాటులోకి తీసుకొచ్చి, ప్ర‌తీ క‌ళాశాల‌లో దీనిని అమ‌లు చేసే అవకాశాలున్నాయని హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఆఫీసర్లు చెబుతున్నారు.

Science Fair : రాష్ట్ర‌స్థాయిలో రెండోసారి సైన్స్‌ఫెయిర్‌.. త్వ‌ర‌లోనే!

ఇదిలా ఉంటే, డిగ్రీలో కొత్త కోర్సుల‌నే కాకుండా.. కామన్ సిలబస్‌ను కూడా తీసుకొచ్చే ఆలోచ‌న‌లో విద్యామండ‌లి అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే, సబ్జెక్టుల వారీగా 30 నుంచి 40 ప్రశ్నలతో కూడిన మెటీరియల్ ను విద్యార్థులకు అందించాలని ప్లాన్ చేస్తున్నారు. దీన్ని సైతం వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి తీసుకురావాలని భావిస్తున్నట్లు సమాచారం.

సిలబస్ రూప‌క‌ల్ప‌న‌..

డిగ్రీ క‌ళాశాల‌ల్లో మ‌రో కొత్త కోర్సును ప్ర‌వేశ పెట్టడంతోపాటు, జేఎన్టీయూ సిలబస్ లో కూడా కొన్ని మార్పులు చేయాలనే యోచనలో ఉన్నత విద్యామండలి ఉన్నట్లు తెలుస్తోంది. రీసెర్చ్‌ కల్చర్‌ను మరింతగా ప్రోత్సహించేలా సిలబస్ రూపకల్పన చేపట్టాలని స‌న్నాహాలు చేస్తున్నారు. రీసెర్చ్‌లు ఎక్కువగా జరిగితేనే పేరు ప్రఖ్యాతలు వస్తాయని, అందుకే అధికారులు ఇంత‌లా మొగ్గు చూపుతున్నట్టు సమాచారం.

University Grants Commission News: యూనివర్సిటీలపై యూజీసీ కొరడా!

ఆన‌వాయితీగా..

జేఎన్టీయూలో ప్రతి మూడేండ్లకోసారి సిలబస్‌ మార్చడం ఆనవాయితీ అన్న విష‌యం తెలిసిందే. ఆర్‌-22 పేరుతో మూడేళ్ల కింద సిలబస్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ సిలబస్‌ గడువు ముగియనుండటంతో ఆర్‌-25 పేరుతో మ‌రో కొత్త సిలబస్‌ను రూపొందించనున్నారు. ఇప్పటికే కొంత మోడల్‌ సిలబస్‌ను రూపొందించార‌ని తెలుస్తోంది. ఇంటర్న్‌ షిప్‌లు, కోర్సు పూర్తికాగానే ఉద్యోగం కల్పించే అత్యుత్తమ సిలబస్‌ను అందుబాటులోకి తీసుకురావాలని ఉన్నత విద్యామండలి అధికారులు భావిస్తున్నారు.

విద్యార్థులకు ఉపయోగపడేలా మెటీరియల్..

రాష్ట్రంలోని డిగ్రీ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా స్టడీ మెటీరియల్‌ను రూపొందించాలని నిర్ణయించామ‌ని ఉన్న‌త విద్యా మండ‌లి చైర్మ‌న్‌ ప్రొఫెస‌ర్ బాలికిష్టారెడ్డి తెలిపారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థులకు ఉపయుక్తంగా ఈ స్టడీ మెటీరియల్‌ ఉంటుంది. సబ్జెక్టుకు చెందిన ముఖ్యాంశాలు గ్రహించేలా, పరీక్షలకు సన్నద్ధం చేయడానికి ఈ స్టడీ మెటీరియల్‌ తోడ్పడనుంది. లోతైన అధ్యయనం చేసేవారి కోసం రెఫరెన్స్‌ పుస్తకాల వివరాలను సైతం మెటీరియల్‌లో పొందుపరుస్తాం. పోటీ పరీక్షల అభ్యర్థులు రూపొందించుకునేలా స్టడీ మెటీరియల్‌ ను రూపొందిస్తునట్లు.. డిగ్రీ కోర్సుల సిలబస్‌ను 30 శాతం చొప్పున మార్చాలని నిర్ణయించామ‌ని వివ‌రించారు.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 07 Jan 2025 12:24PM

Photo Stories