Skip to main content

Science Fair : రాష్ట్ర‌స్థాయిలో రెండోసారి సైన్స్‌ఫెయిర్‌.. త్వ‌ర‌లోనే!

State level science fair at svkm soon to be national level  Press conference by DEO Praveen Kumar about the state science exhibition at SVKM

సాక్షి ఎడ్యుకేష‌న్: ఎస్‌వీకేఎంలో రాష్ట్ర వైజ్ఞానిక ప్ర‌ద‌ర్శ‌న‌ను ఏర్పాటు జాతీయ స్థాయిలో గుర్తింపు ల‌భించేలా ప్ర‌ద‌ర్శించారు. ఈ నేప‌థ్యంలో నిర్వ‌హించిన విలేక‌రుల స‌మావేశంలో మాట్లాడారు డీఈఓ ప్ర‌వీణ్ కుమార్. ఈ స‌మావేశంలో ఆయ‌న ఎస్‌వీకేఎంలో నిర్వ‌హించిన సైన్స్ ఫెయిర్‌కు సంబంధించిన వివ‌రాల‌ను వెల్ల‌డించారు. రాష్ట్రస్థాయి సైన్స్‌ఫెయిర్‌ నిర్వహించటం జిల్లాకు రెండోసారి అన్నారు. ప్రదర్శనలకు మొత్తం 51 గదులను వినియోగించుకుంటున్నట్లు తెలిపారు. మొత్తం జిల్లాస్థాయి అధికారులతో 22 కమిటీలు ప్రదర్శన ఏర్పాట్లలో పాలు పంచుకుంటున్నారన్నారు.

Fake Universities List in India: భారతదేశంలో నకిలీ విశ్వవిద్యాలయాల జాబితా విడుదల

జాతీయ‌స్థాయికి అవ‌కాశాలు..

జడ్చర్ల నియోజకవర్గంలోని ఐదు మండలాల ఎంపీడీఓలు, ఎంఈఓలు పూర్తిస్థాయిలో సేవలు అందిస్తున్నారని అన్నారు. గత ఏడాది ఓ ప్రదర్శన జపాన్‌ దేశంలోనూ ప్రదర్శించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. జిల్లాలో 43 ఇన్‌స్పైర్‌ విభాగంలో ప్రదర్శించనుండగా 11 వరకు జాతీయస్థాయికి ఎంపికయ్యే అవకాశాలున్నట్లు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ 11 ప్రదర్శనలను తెలంగాణ ఇండస్ట్రియల్‌ అధికారులు దత్తత తీసుకున్నారని, వాటిని రీసెర్చ్‌ చేసి అవసరమైన మార్పులు చేయనున్నారన్నారు.

Salary Hikes: ఐటీ ఉద్యోగులకు తీవ్ర నిరాశ.. టాప్‌ 2 కంపెనీ ఝలక్‌.. వార్షిక వేతనాల పెంపు వాయిదా..

కొన్ని ప్రదర్శనలకు విద్యార్థులకు పేటెంట్‌ హక్కులు వచ్చాయని తెలిపారు. మూడు రోజుల ప్రదర్శనలో ఉమ్మడి జిల్లా నుంచి విద్యార్థుల సందర్శనలకు అవకాశం కల్పించామని, అందుకు తగినట్లుగా ప్రణాళికలు రూపొందించామన్నారు. రోజుకు 8 వేల మంది విద్యార్థులు తిలకించేలా ఏర్పాట్లు చేశామన్నారు. సీపీఓ రవీందర్‌, డీపీఓ శ్రీనివాసులు, ఏఎంఓ శ్రీనివాస్‌, ఎంఈఓ మంజులాదేవి, ఎస్‌వీకేఎం ప్రిన్సిపాల్‌ ఎబినేజర్లు పాల్గొన్నారు.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 07 Jan 2025 11:20AM

Photo Stories