Skip to main content

DRDO Junior Research Fellow jobs: డిగ్రీ అర్హతతో DRDOలో పరీక్ష లేకుండా జూనియర్ రీసెర్చ్ ఫెలో ఉద్యోగాలు జీతం నెలకు 37,000

DRDO jobs  DRDO Junior Research Fellow recruitment notification  DRDO Junior Research Fellow job openings  DRDO recruitment for Junior Research Fellow position Ministry of Defense DRDO Junior Research Fellow application  DRDO JRF vacancy announcement
DRDO jobs

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ నుండి జూనియర్ రీసెర్చ్ ఫెలో అనే పోస్టుల భర్తీ కోసం దరఖాస్తుల కోరుతూ నోటిఫికేషన్ జారీ చేశారు. 

ఆంధ్రప్రదేశ్ పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల దేహ దారుఢ్య పరీక్షలు వాయిదా: Click Here

భర్తీ చేస్తున్న పోస్టులు: జూనియర్ రీసెర్చ్ ఫెలో అనే పోస్టులు భర్తీ చేసేందుకు అర్హత కలిగిన వారి నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.

మొత్తం ఖాళీల సంఖ్య : DRDO విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 25 జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టులు భర్తీ చేస్తున్నారు. 

విద్యార్హతలు : JRF పోస్టులకు సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు. మరియు 2023 లేదా 2024 సంవత్సరాల్లో GATE స్కోర్ కలిగి ఉండాలి. (లేదా)
లేదా సంబంధిత విభాగాల్లో ME / M.Tech పూర్తి చేసిన వారు కూడా అర్హులే.

గరిష్ఠ వయస్సు : JRF పోస్టులకు గరిష్ట వయస్సు 28 సంవత్సరాల లోపు ఉండాలి. (31-12-2024 నాటికి)

ఎంపిక విధానం : అర్హత ఉన్న వారికి రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ తుది ఎంపిక చేస్తారు. 

జీతం: ఎంపికైన వారికి నెలకు 37,000/- స్టైఫండ్ అండ్ ఇస్తారు.

అప్లై విధానము : అర్హత ఉండేవారు ముందుగా వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకున్న అప్లికేషన్ డౌన్లోడ్ డౌన్లోడ్ చేసుకుని ఈమెయిల్ ద్వారా అప్లై చేయాలి. jrf.rectt.cabs@gov.in అనే మెయిల్ ఐడికు జనవరి 24వ తేది లోపు అప్లై చేయాలి.
ఇంటర్వ్యూ జరిగే తేదీలలో JRF పోస్టులకు అర్హత ఉండేవారు స్వయంగా ఇంటర్వ్యూకు హాజరు కావాలి.

కాల పరిమితి: ఈ పోస్టులను రెండేళ్ల కాలపరిమితికి భర్తీ చేసుకుంటున్నారు. అభ్యర్థుల పనితీరు ఆధారంగా మరో రెండేళ్లు కొనసాగిస్తారు.

ఇంటర్వ్యూ తేదీలు: 
జనవరి 28వ తేదీన ECE మరియు Electrical విభాగాల వారికి ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. 
జనవరి 29వ తేదీన ఏరోనాటికల్ మరియు మెకానికల్ విభాగాల వారికి ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు 
కంప్యూటర్ సైన్స్ విభాగాల వారికి జనవరి 30వ తేదీన ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.

పోస్టింగ్ ప్రదేశం: Centre for Airborne System (CABS), DRDO, Ministry of Defence, Belur, Yemlur PO, Bengaluru – 560037.


Download Full Notification: Click Here

Apply Online: Click Here

Published date : 08 Jan 2025 10:39AM

Photo Stories