Skip to main content

Students Health : 23 మంది గురుకుల విద్యార్థులకు అస్వ‌స్థ‌త‌.. కార‌ణం ఇదే..

తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లాలోని గురుకుల పాఠశాలలోని ఎప్ప‌టిలాగే విద్యార్థులంతా భోజనాలు చేశారు.
Gurukul students health worsens post dinner causing food poison

సాక్షి ఎడ్యుకేష‌న్: తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లాలోని గురుకుల పాఠశాలలోని ఎప్ప‌టిలాగే విద్యార్థులంతా భోజనాలు చేశారు. కాని, అక్క‌డ ప‌లువురు విద్యార్థులు కాసేప‌టి త‌రువాత అస్వ‌స్త‌త‌కు గురైయ్యారు. వారిని ఆస్ప‌త్రికి ద‌ర‌లిస్తే వారికి ఫుడ్ పాయిజన్ అయిన‌ట్లు డాక్ట‌ర్లు నిర్ధారించారు. జిల్లా కేంద్రం సమీపంలో శర్మానగర్ లో మహాత్మా జ్యోతిబాఫూలే గురుకుల పాఠశాలలో 23 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.

GATE 2025 Hall Ticket Download : గేట్ 2025 హాల్‌టికెట్ విడుద‌ల‌.. ఆ విధంగా డౌన్‌లోడ్ చేసుకోవాలి..

సోమవారం అర్ధరాత్రి విద్యార్థులు వాంతులు చేసుకోవడం పాఠ‌శాల సిబ్బంది గ‌మ‌నించారు. దీంతో విద్యార్థుల‌ను పాఠ‌శాల సిబ్బందులు హుటాహుటిన ప్రభుత్వాస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. కాగా, ఘటనకు సంబంధించి మ‌రిన్ని వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 08 Jan 2025 10:21AM

Photo Stories