Intermediate Exam Fees : ఫీజు చెల్లింపుకు తేదీ పొడగింపు.. చివరి తేదీ ఇదే..!
సాక్షి ఎడ్యుకేషన్: తెలంగాణ ఇంటర్ పరీక్షలకు విద్యార్థులు చెల్లించాల్సిన ఫీజుకు గతంలో ప్రకటించిన తేదీని ఇంటర్ బోర్డు పొడగిస్తున్నట్లు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఫీజు చెల్లింపు తేదీలను, పరీక్షలకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
ఈనెల 16లోగా..
గతంలో ఇచ్చిన ప్రకటన మేరకు డిసెంబర్ 31వ తేదీతో గడువు ముగియగా.. రూ. 2,500 అపరాధ రుసుముతో జనవరి 16వ తేదీ వరకు ఫీజు చెల్లించేందుకు గడువు పొడిగించారు. ఇప్పటి వరకు పరీక్ష ఫీజు చెల్లించని విద్యార్ధులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఇంటర్ బోర్డు సూచించింది. కాగా ఇప్పటికే ఇంటర్ వార్షిక పరీక్షల షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే.
తాజాగా విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం ఇంటర్ పరీక్షలు ఈ ఏడాది మార్చి 5వ తేదీ నుంచి మొదలు కాగా, ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు మార్చి 5వ తేదీ నుంచి, ఆ మరుసటి రోజు అంటే మార్చి 6వ తేదీ నుంచి ఇంటర్ సెకెండియర్ విద్యార్థులకు పరీక్షలు ప్రారంభమవుతాయి. ఈ పరీక్షలు మార్చి 20వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఇక ప్రాక్టికల్ పరీక్షలకొస్తే ఇవి ఫిబ్రవరి 3వ తేదీ నుంచి 22 వరకు జరుగుతాయని షెడ్యూల్‌లో వివరించారు.
తెలంగాణ ఇంటర్ పరీక్షల పూర్తి షెడ్యుల్..
ఫస్ట్ ఇయర్ పరీక్ష తేదీలు..
మార్చి 5వ తేదీన పార్ట్-2 సెకండ్ ల్యాంగ్వేజ్
మార్చి 7వ తేదీన పార్ట్-1 ఇంగ్లీష్ పేపర్
మార్చి 11వ తేదీన మాథ్స్ పేపర్ 1A, బోటని పపెర్-1, పొలిటికల్ సైన్స్ పేపర్-1
మార్చి 13వ తేదీన మ్యాథ్స్ పేపర్ 1B , జూలాజి పేపర్ -1, హిస్టరీ పేపర్-1
మార్చి 17వ తేదీన ఫిజిక్స్, ఎకనామిక్స్
మార్చి 19వ తేదీన కెమిస్ట్రీ, కామర్స్
TG CET 2025 : గురుకుల పాఠశాలలో ప్రవేశాలకు టీజీసెట్-2025.. ఈ విద్యార్థులే అర్హులు!
సెకెండ్ ఇయర్ పరీక్ష తేదీలు..
మార్చి 6వ తేదీన పార్ట్-2 సెకండ్ ల్యాంగ్వేజ్
మార్చి 10వ తేదీన పార్ట్-1 ఇంగ్లీష్
మార్చి 12వ తేదీన మాథ్స్ పేపర్ 2A, బోటని , పొలిటికల్ సైన్స్
మార్చి 15వ తేదీన మ్యాథ్స్ పేపర్ 2B , జూలాజి, హిస్టరీ
మార్చి 18వ తేదీన ఫిజిక్స్ , ఎకనామిక్స్
మార్చి 20వ తేదీన కెమిస్ట్రీ , కామర్స్
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Tags
- telangana inter students
- exam fees date
- intermediate public exams
- tg inter 2025
- inter exams fees dates extended
- march 2025
- Telangana Government
- Department of Education
- inter board
- telangana state board of intermediate
- telangana state board of intermediate education 2025
- Inter First Year
- fees date extended
- ts inter public exams 2025
- ts inter public exams schedule 2025
- ts inter public exams dates and schedule
- Telangana Inter Second year
- students education
- good news for telangana inter students
- inter board of telangana
- march 5th
- january 16th
- deadline for inter exam fees submission
- inter board schedule for public exams
- Education News
- Sakshi Education News
- Telangana Inter exam fee payment
- Inter Board fee extension
- Telangana Inter Exams 2025
- Fee payment deadline for Inter exams
- Telangana Inter Board fee details
- Extended fee payment date
- Student fee payment announcement
- Telangana exam fee update