Skip to main content

TG CET 2025 : గురుకుల పాఠ‌శాల‌లో ప్ర‌వేశాల‌కు టీజీసెట్‌-2025.. ఈ విద్యార్థులే అర్హులు!

Telangana gurukul common entrance test 2025

సాక్షి ఎడ్యుకేష‌న్: తెలంగాణ సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ, మహాత్మా జ్యోతి రావు ఫూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ, సాధారణ గురుకుల పాఠశాలల్లో ఈ విద్యాసంవత్స‌రం 2025-26కి సంబంధించి 5వ తరగతి నుంచి 9వ‌ తరగతి వ‌ర‌కు ప్రవేశాలకు క‌ల్పించేందుకు నోటిఫికేష‌న్ విడుద‌ల చేశారు. ఈ మెర‌కు పాఠ‌శాల‌లో ప్ర‌వేశం పొందేందుకు రాయాల్సిన పరీక్ష టీజీసెట్‌ - 2025కు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాల‌ని గురుకుల విద్యాలయాల సంస్థ జోనల్‌-2 ఆఫీసర్‌ ఫ్లోరెన్స్‌ రాణి ప్ర‌క‌టించారు.

TGCHE: ఉన్నత విద్యలో సమూల మార్పులు.. విద్యార్థులకు ప్రత్యేక స్టడీ మెటీరియల్‌ ఇలా..

ద‌ర‌ఖాస్తులకు అర్హులు: 2024-25 విద్యా 4 నుంచి 8వ తరగతి వరకు చదువుతున్న ఎస్సీ, ఎస్‌టీ, బీసీ, మైనారిటీ, ఆర్థికంగా వెనకబడిన విద్యార్థులు.

వార్షిక ఆదాయం: తల్లి దండ్రుల వార్షికాదాయం పట్టణాలలో ఏడాదికి రూ.2 లక్షలు, గ్రామీణ ప్రాంతాలలో రూ.1.5 లక్షలలోపు ఉండాలి.

ద‌ర‌ఖాస్తుల‌కు ఫీజు చెల్లింపు: రూ.100 చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి.

New Courses in Degree : డిగ్రీలో త్వ‌ర‌లోనే కొత్త కోర్సు ప్ర‌వేశం.. ఇందులోకూడా మార్పులు..!!

ఎంపిక విధానం: 23 ఫిబ్రవరి 2025న జరిగే టీజీసెట్‌ -2025 ప్రవేశ పరీక్షలో కనబర్చిన ప్రతిభ, విద్యార్థులు ఎంపిక చేసుకున్న పాఠశాలల ప్రాధాన్యత ప్రకారం ప్రవేశాలు ఉంటాయి.

ద‌ర‌ఖాస్తుల విధానం: ఆసక్తి, అర్హత కలిగిన విద్యార్థులు www.tswreis.ac.in లేదా https://tgcet.cgg.gov.in వెబ్‌సైట్‌లో ద‌ర‌ఖాస్తులు చేసుకోవాలి.

చివ‌రి తేదీ: ఫిబ్రవరి 1, 2025

ఎంపికైన విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధనతో పాటు ఉచిత భోజనం, వసతి సదుపాయాలు ఉంటాయన్నారు.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 07 Jan 2025 01:04PM

Photo Stories