Skip to main content

Inter Students Breaking News : ఇక‌పై ఇంట‌ర్ ఫ‌స్ట్ ఇయ‌ర్‌లో ప‌రీక్ష‌లు ఉండ‌వు.. ? కార‌ణం ఇదేనా..?

జూనియ‌ర్ క‌ళాశాల విద్యార్థుల‌కు బ్రేకింగ్ న్యూస్ అందించింది ప్ర‌భుత్వం. ఎప్పుడూ లేని విధంగా మార్పుల‌ను ప్ర‌క‌టించి ఇంట‌ర్ బోర్డు. వివ‌రాల్లోకి వెళ్తే..
Big breaking news for ap intermediate students

సాక్షి ఎడ్యుకేష‌న్: జూనియ‌ర్ క‌ళాశాల విద్యార్థుల‌కు బ్రేకింగ్ న్యూస్ అందించింది ప్ర‌భుత్వం. ఇంట‌ర్ ప‌రీక్ష‌ల విష‌యంలో ఏపీ రాష్ట్ర ప్ర‌భుత్వం కీల‌క మార్పులు చేస్తూ తాజాగా నిర్ణ‌యం ప్ర‌క‌టించింది. ప్ర‌తీ ఏటా ఇంట‌ర్ రెండు సంవ‌త్స‌రాల విద్యార్థుల‌కు ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించే విష‌యం తెలిసిందే. అయితే, ఇక‌పై ఇంట‌ర్ ఫ‌స్టియ‌ర్ విద్యార్థుల‌కు ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌ను తొల‌గిస్తామ‌ని బోర్డు కార్య‌ద‌ర్శి కృతికా శుక్లా తాజాగా ప్ర‌క‌టించారు. ప్ర‌థ‌మ సంవ‌త్సరం ప‌రీక్ష‌లు తొల‌గించి, కేవ‌లం ద్వితీయ సంవ‌త్స‌రం అంటే.. సెకండియ‌ర్‌లో మాత్రమే ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హింస్తుంద‌ని కృతికా శుక్లా వెల్ల‌డించారు. ఇంటర్‌ విద్యలో సంస్కరణలపై విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యావేత్తల నుంచి సలహాలు ఆహ్వానిస్తున్నట్లు ఆమె చెప్పారు.

Inter Practical Exams: ఇంటర్‌లో ఉత్తుత్తి ప్రాక్టికల్స్‌కు చెక్‌.. ఈసారి ప్రాక్టికల్స్ ఇలా.. 

ఈ నేప‌థ్యంలో ఇంట‌ర్ విద్యార్థుల‌కు, వారి త‌ల్లిదండ్రుల‌కు ఈ నెల 26 వ‌ర‌కు వారి స‌ల‌హాలు, సూచ‌న‌లు ఇచ్చేందుకు సమ‌యం ఉంద‌ని వివ‌రించారు. వారంద‌రి అభిప్రాయాల‌తోనే ఈ నిర్ణ‌యం అమ‌లు చేస్తామ‌ని పేర్కొన్నారు. ఒక‌వేళ అంద‌రూ దీనికి ఏకీభ‌విస్తే వ‌చ్చే విద్యా సంవ‌త్స‌రం అంటే.. 2025-26 నుంచి ఇంట‌ర్‌లో సైన్స్ సబ్జెక్టుల్లో ఎన్‌సీఈఆర్‌టీ సిల‌బ‌స్ ప్ర‌వేశ పెడ‌తామ‌ని తెలిపారు.

దీంతో నీట్‌, జేఈఈ వంటి జాతీయస్థాయి పోటీ పరీక్షలకు..

2024-25 నుంచి పదో తరగతిలో ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్యపుస్తకాలు ప్రవేశపెట్టారు. 2025-26 ఇంటర్‌ ప్రథమ సంవత్సరంలో ఎన్‌సీఈఆర్టీ పాఠ్య పుస్తకాలు ప్రవేశపెడతాం. దీంతో నీట్‌, జేఈఈ వంటి జాతీయస్థాయి పోటీ పరీక్షలకు సులభమవుతుంది. దాదాపు 15 రాష్ట్రాల్లో ఎన్‌సీఈఆర్టీ పాఠ్యపుస్తకాలను ఇంటర్‌లో ప్రవేశపెట్టారు. సిలబస్‌ సంస్కరణ, నూతన సబ్జెక్ట్‌ కాంబినేషన్లకు ప్రతిపాదనలు చేస్తున్నాం అన్నారు. అలాగే పరీక్షల మార్కుల కేటాయింపు విధానంలో సంస్కరణలు తెస్తాంమ‌న్నారు. 

ఇందులో భాగంగానే ఇంటర్‌ మొదటి సంవత్సర పరీక్షలు తొలగిస్తాం అన్నారు. ఆయా కాలేజీలు అంతర్గతంగా ప్రథమ సంవత్సర పరీక్షలు నిర్వహిస్తాయి అన్నారు. ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం పరీక్షలనే బోర్డు నిర్వహిస్తుందన్నారు. 

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

చాలా ఏళ్లుగా ఇంటర్‌ విద్యలో మార్పులు జరగలేదు. జాతీయ కరికులం చట్టం ప్రకారం సంస్కరణలను అమలు చేస్తున్నాము. ఈ మార్పులలో భాగంగా ఇంటర్‌ ప్రథమ సంవత్సరాంత పరీక్షలను రద్దు చేస్తాము. బదులుగా, ప్రతి కళాశాల తమకుతమగా ప్రథమ సంవత్సరం పరీక్షలను నిర్వహిస్తుంది. ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం పరీక్షలను మాత్రం బోర్డు నిర్వహిస్తుంది అని కృతికా శుక్లా తెలిపారు.

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

ఏపీ ఇంట‌ర్మీడియ‌ట్ ఫ‌స్ట్ అండ్ సెకండ్ ఇయ‌ర్ ఎగ్జామ్ 2025 షెడ్యూల్ ఇదే..

Day & Date
 

1st year examinations
 

Day & Date
 

2nd year examinations
 

Saturday

01.03.2025
 

PART – II:

2nd LANGUAGE PAPER-I
 

Monday

03.03.2025
 

PART – II:

2nd LANGUAGE PAPER-II
 

Tuesday

04.03.2025
 

PART – I:

ENGLISH PAPER– I
 

Wednesday

05.03.2025
 

PART – I:

ENGLISH PAPER– II
 

Thursday

06.03.2025
 

PART-III:

MATHEMATICS PAPER-IA

BOTANY PAPER-I

CIVICS PAPER-I
 

Friday

07.03.2025
 

PART-III:

MATHEMATICS PAPER-II A

BOTANY PAPER-II

CIVICS PAPER-II
 

Saturday

08.03.2025
 

MATHEMATICS PAPER – IB

ZOOLOGY PAPER – I

HISTORY PAPER – I
 

Monday

10.03.2025

 

MATHEMATICS PAPER– II B

ZOOLOGY PAPER– II

HISTORY PAPER– II
 

Tuesday

11.03.2025
 

PHYSICS PAPER –I

ECONOMICS PAPER– I
 

Wednesday

12.03.2025
 

PHYSICS PAPER –II

ECONOMICS PAPER– II
 

Thursday

13.03.2025
 

CHEMISTRY PAPER – I

COMMERCE PAPER – I

SOCIOLOGY PAPER – I

FINE ARTS, MUSIC PAPER – I
 

Saturday

15.03.2025
 

CHEMISTRY PAPER –II

COMMERCE PAPER –II

SOCIOLOGY PAPER – II

FINE ARTS, MUSIC PAPER – II
 

Monday

17.03.2025
 

PUBLIC ADMINISTRATION

PAPER–I

LOGIC PAPER– I

BRIDGE COURSE MATHEMATICS PAPER– I (FOR Bi.P.C STUDENTS)
 

Tuesday

18.03.2025
 

PUBLIC ADMINISTRATION

PAPER–II

LOGIC PAPER – II

BRIDGE COURSE MATHEMATICS PAPER–II (FOR Bi.P.C STUDENTS)
 

Wednesday

19.03.2025
 

MODERN LANGUAGE PAPER – I

GEOGRAPHY PAPER– I
 

Thursday

20.03.2025
 

MODERN LANGUAGE PAPER– II

GEOGRAPHY PAPER– II

Published date : 08 Jan 2025 04:52PM

Photo Stories