Inter English Question Paper Error : 25 నిమిషాలు కోల్పోయిన ఇంటర్ విద్యార్థులు.. ప్రశ్నపత్రాల్లో ఇవే లోపాలు..

అమరావతి: ఇప్పటికే ఇంటర్ విద్యార్థుల బోర్డు పరీక్షలు ప్రారంభమైయ్యాయి. అయితే, ఈ పరీక్షలో పేపర్ ముద్రణలో ఏదో లోపం కారణంగా విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది.
25 నిమిషాలు కోల్పోయి..
రాష్ట్రవ్యాప్తంగా బుధవారం అంటే, మార్చి 5వ తేదీన జరిగిన ఇంటర్ రెండో సంవత్సరం ఇంగ్లిష్ పేపర్ ముద్రణ తీవ్ర గందరగోళానికి దారి తీసింది. దీంతో.. విద్యార్థులు 25 నిమిషాల సమయాన్ని కోల్పోయారని తెలుస్తోంది. నిన్న ఉదయం 9 గంటలకు పరీక్ష ప్రారంభం కాగా, అరగంట తర్వాత అంటే, 9:30కు ఈ తప్పును గుర్తించిన విద్యార్థులకు ఏం చేయాలో అర్థం కాలేదు. అనంతరం సమస్యను ఇన్విజిలేటర్లకు వివరించారు. దీంతో, వారు విషయాన్ని ఇంటర్మీడియట్ బోర్డు పరీక్షల విభాగం దృష్టికి తీసుకెళ్లారు. అసలు విషయమేంటి..!
ముద్రణ సరిగ్గా లేక..
నిన్న జరిగిన ఇంటర్ సెకండియర్ ఇంగ్లిష్ పరీక్షలో 8వ ప్రశ్నగా 'అడ్వర్టైజ్‌మెంట్ చదివి కింద ప్రశ్నలకు సమాధానాలు రాయాలి' అంటూ ఒక్క మార్కు ప్రశ్నలు ఐదు ఇచ్చారు. అయితే, ప్రశ్నపత్రంలో ఇచ్చిన అడ్వర్టైజ్‌మెంట్ ముద్రణ సరిగ్గా లేకపోవడంతో అందులో ఏముందో ఎవరూ గుర్తించలేని పరిస్థితి. పుస్తకంలోని ప్రింట్‌ను ఫొటో తీసుకుని నేరుగా ముద్రించడంతో అక్షరాలు కనిపించక విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు.
13వ ప్రశ్న 5 మార్కులకు.. కానీ!!
వివిధ జిల్లాల్లో అధికారులు ఇది గుర్తించి విషయాన్ని ఉన్నతాధికారులకు తెలిపి దిద్దుబాటు చర్యలు చేపట్టారు. మాస్టర్ ప్రశ్నపత్రాన్ని అన్ని కాలేజీలకు పంపి సమస్యను సరిచేసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో కనిపించని అంశాలను కొన్నిచోట్ల బోర్డుపై రాసి వివరించగా, మరికొన్ని జిల్లాల్లో ప్రశ్నపత్రంలోని అంశాలను ఇన్విజిలేటర్లు విద్యార్థులకు చదివి వినిపించారు.
అలాగే, 13వ ప్రశ్నగా 'ఫిల్ ఇన్ ది బ్లాంక్స్' కింద పోస్టాఫీస్ సేవింగ్ బ్యాంక్ అకౌంట్‌పై అవగాహన కోసం ఇచ్చింది కూడా విత్డ్రా ఫారం ఫొటోను ముద్రించిన విధానం విద్యార్థులను మరింత గందరగోళానికి గురి చేసింది. ఇందులో ఏముందో అర్థం కాకుండా పోయింది. ఇక, ఈ ప్రశ్నలకు 10 అర మార్కు ప్రశ్నలు (5 మార్కులు) ఇచ్చారు.
సమయం కూడా తక్కువే..
ఇలా ఈ రెండు ప్రశ్నల ముద్రణా లోపంతో దాదాపు 25 నిమిషాల సమయం వృధా అయిందని, అదనపు సమయం కూడా ఇవ్వలేదని విద్యార్థులు వాపోయారు. ఇక శనివారం జరిగిన ఇంటర్ మొదటి సంవత్సరం ఇంగ్లిష్ పేపర్‌ను సైతం విజయవాడలోని ఓ కార్పొరేట్ కళాశాలలో ఆలస్యంగా ఇచ్చినట్లు ఆరోపణలు వచ్చాయి.
Four Days Holidays 2025 : వరుసగా నాలుగు రోజులు సెలవులు... కానీ..!
కాగా, ఈ తప్పులపై సమగ్ర విచారణ చేయాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ పేరెంట్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ముద్రణ సరిగ్గాలేని రెండు ప్రశ్నలకు సంబంధించి విద్యార్థులందరికీ పూర్తి మార్కులు వేయాలని అసోసియేషన్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు మలిరెడ్డి కోటారెడ్డి, అధ్యక్షుడు శిఖరం నరహరి, ప్రధాన కార్యదర్శి జి. ఈశ్వరయ్య డిమాండ్ చేశారు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Tags
- AP Inter Exams
- inter board exams 2025
- english question paper errors
- ap inter english question paper
- lack of printing
- students anger
- inter board exam question paper error
- printing error
- ap inter 2nd year exams
- ap inter 2nd year english question paper
- printing error in english question paper
- printing error in ap inter 2nd year english question paper
- Education News
- Sakshi Education News