Skip to main content

Mistake in Inter Question Paper : ఇంట‌ర్ ప‌రీక్ష‌లో మ‌రో త‌ప్పిదం.. బోర్డు నుంచి స‌మాచారం..

ఇంటర్మీడియెట్‌ పబ్లిక్‌ పరీక్షల్లో భాగంగా శనివారం నిర్వహించిన సీనియర్‌ ఇంటర్‌ కెమిస్ట్రీ పరీక్షలో ఒక ప్రశ్న తప్పుగా వచ్చింది.
Mistake in chemistry question paper clears inter board

గుంటూరు ఎడ్యుకేషన్‌: ఇంటర్మీడియెట్‌ పబ్లిక్‌ పరీక్షల్లో భాగంగా శనివారం నిర్వహించిన సీనియర్‌ ఇంటర్‌ కెమిస్ట్రీ పరీక్షలో ఒక ప్రశ్న తప్పుగా వచ్చింది. ప్రశ్నాపత్రంలోని సెక్షన్‌–బీలో నాలుగు మార్కులకు ఇచ్చిన 14వ ప్రశ్నలో ‘ఏ సొల్యూషన్‌ ఆఫ్‌ గ్లూకోజ్‌ ఇన్‌ వాటర్‌ ఈజ్‌ లేబుల్డ్‌ యాజ్‌ 100 పర్సంట్‌ (డబ్ల్యూ/వీ)’గా వచ్చింది. ఉదయం 9 గంటలకు పరీక్ష ప్రారంభం కాగా, 10.30 గంటలకు ఇంటర్మీడియెట్‌ బోర్డు నుంచి అందిన సమాచారంతో ఈ ప్రశ్నలో ఉన్న ‘డబ్ల్యూ/వీ’కి బదులుగా డబ్ల్యూ/డబ్ల్యూగా మార్చుకుని జవాబులు రాయాలని విద్యార్థులకు ఇన్విజిలేటర్లు సూచించారు.

Holiday : నెలాఖ‌రిలో సెల‌వు.. ప‌రీక్ష వాయిదా ప‌డుతుందా..!!

ఒక్క అక్ష‌రం

ముద్రణ లోపం కారణంగా తప్పిదం జరిగిందని, అందుకే ప్రశ్నను మార్పు చేసుకుని జవాబు రాయాలని పేర్కొన్నారు. అయితే, అప్పటికే గంటన్నర సమయం గడిచిపోవడంతోపాటు ప్రశ్నాపత్రంలో ఇచ్చిన ప్రశ్నకు యథావిధిగా చాలామంది విద్యార్థులు జవాబు రాశారు. దానిని మ‌రోసారి మార్పుచేసి జవాబు రాయాల్సి రావడంతో సమయం సరిపోక ఇబ్బందిపడినట్లు విద్యార్థులు తెలిపారు.

Govt Schools Close : వేలాది స్కూళ్ల‌కు తాళాలు.. టీచ‌ర్ల‌పై ఒత్తిడి..

కాగా, ప్రశ్నాపత్రంలో ఇచ్చిన ‘డబ్ల్యూ/వీ’ అనే పదం సరైనదేనని, అనవసరంగా దీనిని మార్పుచేసి విద్యార్థులను అయోమయానికి గురిచేశారని కెమిస్ట్రీ సబ్జెక్టు నిపుణులు చెబుతున్నారు. కొన్ని కార్పొరేట్‌ కళాశాలలు తమ విద్యార్థులకు ఇచ్చిన స్టడీ మెటీరియల్‌లో డబ్ల్యూ/డబ్ల్యూ అని ఉందని, వారికి లబ్ధి చేకూర్చేందుకు ప్రశ్నను సవరించారని ఆరోపిస్తున్నారు.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 17 Mar 2025 03:36PM

Photo Stories